ప్రస్తుత కాలంలో ఈ భూ ప్రపంచంపై జీవించడానికి అతి ముఖ్యమైన వాటిలో విద్య ఒకటి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఉన్నా విద్య లేకపోతే ఫలితం ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అక్షరాస్యత శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సూచిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెబుతున్నా వివిధ కారణాల వల్ల ఎంతోమంది చదువుకు దూరమవుతున్నారు.
చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా కుటుంబ పరిస్థితుల వల్ల కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో చదువుకు దూరమవుతున్నారు. అయితే ఒడిశాలో ఒక వృద్ధుడు పిల్లలు చదువుకోవాలని.. వివిధ కారణాల వల్ల బడికి హాజరు కాని వారికి చదువు చెప్పి సన్మార్గంలో పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 75 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా విద్యార్థులకు చదువు చెబుతున్నాడు.
చదువుకోని విద్యార్థుల గురించి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా ‘‘నందా ప్రస్తి’’ అనే 75 సంవత్సరాల వృద్ధుడు మాత్రం వృద్ధుడు మాత్రం పిల్లల చదువు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. ఒడిశాలోని జాజ్పూర్ జిల్లాలోని బర్తాండా గ్రామంలో పాఠశాలకు వెళ్లని పిల్లలకు చెట్టు కింద చదువు చెప్పి నందా ప్రస్తి మంచి పేరుతో పాటు గుర్తింపు తెచ్చుకున్నారు.
పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా అందరికీ చదువు చెబుతూ నందా ప్రస్త ప్రశంసలందుకుంటున్నారు. తన వల్ల ఒకప్పుడు వేలిముద్రలు వేసేవారు చదువు నేర్చుకోవడంతో పాటు భగవద్గీత చదివే స్థాయికి ఎదిగారని చెప్పారు. వయస్సు పెరుగుతున్నా ఓపిక తెచ్చుకుని మరీ నందా ప్రస్తా తరగతులు నిర్వహిస్తున్నారు. అతనికి పాఠాలు చెప్పడానికి సరైన స్థలం లేకపోవడంతో అధికారులను సహాయం చేయమని కోరారు. వాళ్లు స్పందించకపోవడంతో పూర్వ విద్యార్థులే స్కూల్ నిర్మించే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
వేసవి తీవ్రత పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లగా ఉంచడం, నీటి లోపాన్ని నివారించడం అత్యంత అవసరంగా మారుతోంది. ఈ సమయంలో…
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న కొద్దీ శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో దాహాన్ని తీరుస్తూ, శరీరానికి చల్లదనం…
దేశవ్యాప్తంగా శివభక్తి గురించి చర్చ జరుగుతున్న వేళ, ఇద్దరు భక్తుల అసాధారణ సంకల్పం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచు కొండల…
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయానికి సంబంధించిన వార్షిక…
తెలుగు సినీ రంగంలో రచయితగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎల్.బీ. శ్రీరామ్ తాజాగా తన కెరీర్‌లో ఎదురైన ఒక…