ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఎంబీబీఎస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆసక్తి ఉంటే కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓఎన్జీసీ ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచి భవిష్యత్తును పొందవచ్చు.
ఈ ఉద్యోగాలకు మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 15వ తేదీ దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. https://www.ongcindia.com/ వెబ్ సైట్ ద్వారా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
బ‌్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలి. 1 : 10 పద్ధతిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్టింగ్ లో 70 శాతం మార్కులకు, 30 శాతం ఇంటర్వ్యూకు మార్కులు కేటాయించడం జరుగుతుంది. మొత్తం 8 ఉద్యోగాలు ఉండగా కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ – ఫీల్డ్ డ్యూటీ ఉద్యోగాలు ఆరు ఉన్నాయి.
కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్ – జనరల్ డ్యూటీ ఒక ఉద్యోగ ఖాళీ ఉండగా మెడికల్ ఆఫీసర్ ఆక్యుపేషనల్ హెల్త్ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. వెబ్ సైట్ లోని నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 72,000 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…