ప్రస్తుతం ఉన్న ఈ కరోనా పరిస్థితులలో ప్రతి ఒక్కరూ ఇంటినుంచి షాపింగ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. వారికి కావాల్సిన ఏచిన్న వస్తువు అయినా ప్రస్తుతం మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు సైబర్ నేరగాళ్లు ఇదే అదునుగా భావించి పెద్ద ఎత్తున మోసాలకు తెర లేపుతూ ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ సైబర్ నేరగాళ్ల మాయలో ఓ పోలీసు అధికారి భార్య చిక్కుకొని లక్ష రూపాయల డబ్బులను మోసపోయిన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ సీఐ సతీమణి ఆన్లైన్ సేల్స్ సంస్థ నుంచి ఒక డిజైన్ చీరను ఎంపిక చేసుకొని దానిని ఆర్డర్ చేసింది. ఆమె చేసిన ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత ఓపెన్ చేసి చూడగా ఆమె పెట్టిన చీర ఒకటైతే ఆమెకు పంపిన చీర మరొకటి కావడంతో ఆమె వెంటనే గూగుల్ సెర్చ్ లో కస్టమర్ కేర్ నెంబర్ అనుకొని పొరపాటున సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేసింది.
ఈ విధంగా సైబర్ నేరగాళ్లకు ఫోన్ చేయడంతో వారు ఇదే అదనుగా భావించి తాము సంస్థ ప్రతినిధులమని చీర నచ్చకపోతే రిటన్ చేస్తే డబ్బులు తమ ఖాతాలో క్రెడిట్ అవుతాయని చెప్పారు.ఈ క్రమంలోనే తమ బ్యాంకు వివరాలను వారికి తెలపాల్సిందిగా నేరగాళ్లు చెప్పడంతో ఈమె నిజమేనని భావించి వెంటనే వారికి తన బ్యాంక్ వివరాలను తెలిపింది.
ఈ విధంగా బ్యాంకు వివరాలను తెలిపిన కొంత సమయానికి తన బ్యాంకు ఖాతా నుంచి లక్ష రూపాయలు డెబిట్ అయినట్లు బ్యాంకు నుంచి మెసేజ్ రావడంతో ఎంతో షాక్ అయింది. ఈ షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు సీఐ సతీమణి ఫిర్యాదు చెసింది.ఈ క్రమంలోనే తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఒటీపీ వంటివి ఎలాంటి పరిస్థితులలో కూడా ఎవరికీ తెలియనివ్వకూడదని పోలీసులు ఎన్నోసార్లు ప్రజలను హెచ్చరించిన అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ పెద్ద ఎత్తున మోసపోతున్నారని ఈ సందర్భంగా పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…