భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి పెద్దది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI). అయితే ఎస్బీఐ తన ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. అదేంటంటే.. ఇప్పటి వరకు ఎవరైన తమ ఆధార్ కార్డుకు పాన్ కార్డుతో లింక్ చేసుకోకపోతే సెప్టెంబర్ 30వ తేదీలోగా లింక్ చేయాలని.. లేదంటే బ్యాంకింగ్ సదుపాయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది.
అంతే కాకుండా ఖాతాను కూడా నిలిపివేసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్బీఐ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఆధార్ తో పాన్ నంబర్ ను లింక్ చేయాలని ప్రతీ సారి చెబుతూనే ఉన్నా.. చాలామంది దానిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వారికి ఇది ఒక హెచ్చరికలాంటిది అంటూ పేర్కొంది. సెప్టెంబర్ 30లోపు పాన్ కార్డు, ఆధార్‌లను లింక్ చేయకపోతే, పాన్ కార్డు ఇన్‌యాక్టివ్ కావడమే కాకుండా.. మరే ఇతర లావాదేవీలకు పని చేయదంటూ తెలిపింది.
ఇప్పటికే లింక్ గడవు ఎప్పుడో ముగించాలి.. కానీ కరోనా కారణంగా ఇలా వాయిదా వేయాల్సి వచ్చిందిని బ్యాంక్ అధికారులు తెలిపారు. డీమ్యాట్ ఖాతాలు తెరవడం, స్థిరాస్తుల లావాదేవీలు, అకౌంట్ ఓపెనింగ్, నగదు జమ చేయడం వంటి లావాదేవీలన్నింటికీ పాన్ కార్డు తప్పనిసరి అంటూ స్పష్టం చేసింది. లింక్ చేయాలని అనుకునే వారు ఇన్ కం ట్యాక్స్ వెబ్ సైట్ లో ఆధర్ పాన్ లింక్ పై క్లిక్ చేసి చేయొచ్చు. లేదా SMS ద్వారా కూడా లింక్ చేయొచ్చు.
అదెలా అంటే.. UIDPAN అని టైప్ చేసి 12 అంకెల ఆధార్ నెంబర్ 10 అంకెల PAN నెంబర్ టైప్ చేసి 567678 లేదా 56161కు మెసేజ్ చేయండి. తర్వాత కొన్ని గంటల తర్వాత లింక్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…