Parvathi Melton: ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి పార్వతి మెల్టన్ ఒకరు.ఈమె ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాలో జో అనే పాత్ర ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించిన పార్వతి మెల్టన్ తన నటనతో మెప్పించారు.
జల్సా సినిమా కన్నా ముందు ఈమె పలు సినిమాలలో నటించిన ఈ సినిమా ద్వారా ఈమెకు ఎంతో గుర్తింపు వచ్చిందని చెప్పాలి.ఇలా పలు సినిమాలలో హీరోయిన్గా నటించడమే కాకుండా మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో ఏకంగా ఐటమ్ సాంగ్ చేసి మెస్మరైజ్ చేశారు. పూవై పూవై అంటాడు ఆటో అప్పారావు అంటూ ఆమె సందడి చేసిన ఈ పాట అప్పట్లో సంచలనాలను సృష్టించింది.
ఇలా తన సినీ కెరియర్ లో ఎంతో బిజీగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. అయితే అవకాశాలు రాక దూరమయ్యారా లేక వ్యక్తిగత కారణాలు వల్ల దూరం అయ్యారు తెలియదు కానీ ఈమె 2013 వ సంవత్సరంలో శంసులాలానిని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.
సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమయంలో కాస్త బొద్దుగా ఉన్నటువంటి పార్వతి మెల్టన్ ఇప్పుడు మాత్రం సన్నజాజితీగల గుర్తుపట్టలేని విధంగా ఎంతో నాజుగ్గా తయారయ్యారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందించే మహాలక్ష్మి పథకం ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. అయితే తాజాగా…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…