Virupaksha: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా తాజాగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటి షో నుండే మంచి హిట్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా సక్సెస్ పై పలువురు సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తూ విరూపాక్ష టీంకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా సాయి ధరమ్ తేజ్ కి విరూపాక్ష టీంకి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా విరూపాక్ష సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ సాయి ధరమ్ తేజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక బొకేతో పాటు బెస్ట్ విషెస్ చెబుతూ.. కార్డ్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ కార్డు లో ‘ డియర్ తేజు గారు మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఆన్ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ విరూపాక్ష..బెస్ట్ విషెస్ పవన్ కల్యాణ్ ‘ అంటూ ఓ మెసేజ్‌తో కూడిన కార్డ్‌ని పవన్ కళ్యాణ్ కానుకగా పంపాడు. ఈసినిమాకు ఫస్ట్ ట్రైలర్‌ను లాంచ్ చేసి ఆశీర్వదించిన పవన్ కల్యాణ్ రిలీజైన మొదటి రోజే సక్సెస్ అంటూ శుభాకాంక్షలు చెప్పడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.
Virupaksha: జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది…
పవన్ కళ్యాణ్ పంపిన కానుకకి సాయిధరమ్ తేజ్ కూడా రియాక్ట్ అవుతూ ” థాంక్స్ చిన్న మామ..నా జీవితంలో ఇది చాలా గుర్తుండిపోయే రోజు “అంటూ రీట్వీట్ చేశాడు. యువ దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరి నటనకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రమాదం నుండి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన మొదటి సినిమా కావడం విశేషం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…