Movie News

ఇంకొకసారి నన్ను ‘పవర్ స్టార్’ అని పిలవకండి.. ఫాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం చేతినిండా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న పవన్ భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు లాంటి సినిమాల్లో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతడు కోట్లాది మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నాడు. పవన్ అభిమానులు అతడిని ప్రేమతో పవర్ స్టార్ అని పిలుచుస్తుంటారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే థియేటర్ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంటుంది.భారీ కటౌట్లతో సందడి సందడిగా ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అన్న పిలుపు నచ్చడం లేదు.అందుకు ఉదాహరణగా ఇటీవ‌ల జ‌రిగిన ఒక మీటింగ్‌లో పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని తనని కేవలం జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదని,బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇక తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మీటింగ్ ఏర్పాటు చేయ‌గా, అక్క‌డ అతని అభిమానులు ప‌వ‌ర్ స్టార్ అంటూ గోల‌లు చేశారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స‌భా మ‌ర్యాద తెలియ‌దా, ప‌వ‌ర్ స్టార్ అని ఎందుకు అరుస్తున్నారు. నన్ను పవర్ స్టార్ అని పిలవడం మానేయండి, ఇంకొకసారి పవర్ స్టార్ అని పిలవకండి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే పవన్ కళ్యాణ్ కి పవర్ స్టార్ అన్న బిరుదును పోసాని కృష్ణ మురళి ఇవ్వడం గమనార్హం.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బాలీవుడ్‌లో దక్షిణాది నటీమణులపై వివక్ష?.. రెజీనా సంచలన వ్యాఖ్యలు…

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…

3 minutes ago

గ్రూప్ స్టేజ్ ముగిసింది.. సూపర్-8 సంగ్రామం మొదలు! టీమిండియాకు అసలు పరీక్ష ఇప్పుడు…

2026 టీ20 వరల్డ్ కప్ ఉత్కంఠభరిత దశలోకి అడుగుపెట్టింది. లీగ్ పోరాటాలు దాదాపు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు సూపర్-8…

18 minutes ago

“ఇస్రోలో ఇంటర్న్‌షిప్ ఛాన్స్.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో దరఖాస్తులు ప్రారంభం!”

అంతరిక్ష రంగంలో కెరీర్‌ కలలు కనే విద్యార్థులకు ఇది మంచి అవకాశం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్…

31 minutes ago

“దేశంలో ఎక్కడా లేని శివలింగం.. తిరుపతి సమీపంలోనే అరుదైన అద్భుతం!”

తిరుపతి నగరానికి కొద్ది దూరంలో, రేణిగుంట మండలంలోని గుడిమల్లం గ్రామంలో ఒక అపూర్వ చారిత్రక కట్టడం భక్తులను, చరిత్రాభిమానులను సమానంగా…

41 minutes ago

“తమిళ రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్?.. స్టాలిన్‌ను కలిసిన ఓపీఎస్!”

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.…

1 hour ago

“చిన్న ఉద్యోగులకు బిగ్ రీలీఫ్.. 2025 లేబర్ కోడ్‌తో తప్పనిసరి అపాయింట్‌మెంట్ లెటర్!”

భారతదేశంలో ఉద్యోగ రంగంలో కీలక మార్పులకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్‌లు ఇప్పుడు…

1 hour ago