Pawankalyan: సినీ నటుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కూడా బిజీగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన స్థాపించిన జనసేన పార్టీ పది సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మచిలీపట్నంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ అధికారపక్ష నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ప్యాకేజీ గురించి మాట్లాడుతూ అధికార పక్ష నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుంటారని ఈయన ప్యాకేజీ తీసుకుంటూ పలు పార్టీలతో పొత్తుకుదుర్చుకున్నారనీ అధికార పక్ష నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విమర్శలపై గతంలో స్పందించిన పవన్ చెప్పు చూపించిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా మరోసారి ప్యాకేజ్ గురించి మాట్లాడుతూ తాను వెయ్యి కోట్ల ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడుతున్నారు ఇంకోసారి ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడితే చెప్పు తీసి కొడతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.డబ్బు కావాలంటే సంపాదించుకునే స్టామినా తనకు ఉందని తాను రోజుకు రెండు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు.
అందరిలా తాను డబ్బు మనిషిని కాదని,డబ్బు కోసం ఇతరుల నుంచి ప్యాకేజీ తీసుకునే అవసరం తనకు లేదని తెలిపారు. తాను చూడని డబ్బు లేదని,డబ్బు అవసరమైతే కష్టపడి సంపాదించుకుంటానే తప్ప ఇలా ప్యాకేజీ తీసుకొనే అలవాటు తనకు లేదంటూ మరోసారి ఈ సందర్భంగా తాను ప్యాకేజీ తీసుకున్నానని మాట్లాడే వారికి తనదైన స్టైల్ లో పవన్ వార్నింగ్ ఇచ్చారు.ఇలా పవన్ కళ్యాణ్ ఈ సభలో చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…