దేశంలో సంవత్సరం సంవత్సరానికి నిరుద్యోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అదే సమయంలో ఉద్యోగాలు కల్పిస్తామని పలు కంపెనీలు, కన్సల్టెన్సీ సంస్థలు, ముఠాలు చేస్తున్న మోసాలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 220 మంది నిరుద్యోగులు మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలోని తెనాలిలో కోఆపరేటివ్ సొసైటీ పేరుతో బ్యాంక్ ప్రారంభిస్తామనిఒక ముఠా మోసాలకు పాల్పడింది.
ఈ ముఠా ఒక్కో నిరుద్యోగి నుంచి లక్షల్లో వసూలు చేసి కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిందని సమాచారం. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బాధితులు మోసపోయామని గ్రహించి గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్ ఇప్పటికే అధికారులను ఈ కేసు గురించి దర్యాప్తు చేయమని ఆదేశాలు జారీ చేశారు. లక్షల్లో మోసపోయిన నిరుద్యోగులు తమ డబ్బును వెనక్కు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే పది మంది సభ్యులు గ్రూపుగా ఏర్పడి తాము త్వరలో కోఆపరేటివ్ సొసైటీ పేరుతో బ్యాంకును ప్రారంభిస్తామని ప్రచారం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ నిరుద్యోగులకు ఈ బ్యాంకులో ఉపాధి కల్పిస్తామని పెద్దఎత్తున ప్రచారం చేశారు. బ్యాంక్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల పేర్లతో 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి ఈ ముఠా వసూలు చేసింది.
రాష్ట్రంలో గుంటూరులోని తెనాలితో పాటు 20 బ్రాంచిలను ఏర్పాటు చేశామని చెప్పి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడంతో డబ్బులు చెల్లించి మోసపోయామని నిరుద్యోగులు చెబుతున్నారు. డబ్బు వెనక్కు ఇవ్వాలని కోరితే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని నిరుద్యోగులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…