సాధారణంగా కొన్నిసార్లు పెరట్లో ఉన్నటువంటి పాములు ఇళ్లల్లోకి ప్రవేశించడం మనం చూస్తుంటాము.అయితే మన ఇంట్లో ఏదైనా కుక్క లేదా పిల్లి వంటి పెంపుడు జంతువులు ఉంటే అవి వాటిని ముందుగా పసిగట్టి ఇంటి యజమానులకు తెలియజేయడం లేదా వాటిని లోపలికి రాకుండా ఆపడమో చేస్తుంటాయి. కొన్నిసార్లు ఈ విషపూరితమైన పాములతో పోరాడుతూ ప్రాణాలను కూడా పోగొట్టుకున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఒడిశా రాజధాని భూవనేశ్వర్ నగరంలోని భీమాటాంగ్రీ గ్రామంలో చోటు చేసుకుంది. సంపద్ కుమార్ పరిదా అనే వ్యక్తి తన ఇంట్లో ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. మంగళవారం సంపద్ కుమార్ పెరట్లో నుంచి ఇంట్లోకి ఒక తాచుపాము వస్తుండడం గమనించిన పిల్లి ఆ పాము ఇంట్లోకి రాకుండా అడ్డుపడింది . ఈ క్రమంలోనే పిల్లిని అనుసరిస్తూ వెళ్లిన సంపద్ నాలుగడుగుల తాచుపామును పిల్లి అడ్డుకోవడం చూశాడు.
ఈ విధంగా తన పెరట్లో తాచుపాము ఉండటంతో వెంటనే సంపద్ స్నేక్ హెల్ప్ లైన్ సెంటర్ కి ఫోన్ చేయడంతో అరుణ్ కుమార్ అనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని తాచుపాము పట్టుకొని నగరం బయట వైపు చాలా దూరంలో ఆ పామును వదిలిపెట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం తలెత్తలేదు.
పాము ఇంట్లోకి రాకుండా అడ్డుపడిన పిల్లి పై పాము దాడి చేసిందేమోనని చూడటంతో పిల్లి పై ఎలాంటి కాట్లు లేకపోవడం వల్ల యజమాని సంపద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…