వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన నటి రోజా. ఇప్పుడు కాదు కానీ.. రెండు దశాబ్దాల కింద తను తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. స్టార్ హీరోల సరసన నటించి.. తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు రోజా. సినిమా రంగంలో ఓ వెలుగు వెలిగాక.. అక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రోజా. రాజకీయాల్లో ఇప్పటికీ రాణిస్తూనే.. మరోవైపు సినిమాలు, టీవీ షోలు చేస్తూ.. ఫుల్ బిజీ అయిపోయారు రోజా.
అయితే.. రోజా గురించి చాలా విషయాలు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. తన వ్యక్తిగత విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. తన అసలు పేరు రోజా కాదని కూడా చాలా మందికి తెలియదు. తన అసలు పేరు రోజా కాదు.. శ్రీలత. తను సినిమాల్లోకి రాకముందు.. తనను అందరూ శ్రీలత అనే పిలిచేవారు. కానీ.. సినిమాల్లోకి వచ్చాక తన స్క్రీన్ పేరు రోజాగా మారింది. అప్పటి నుంచి తను ఇక రోజాగానే చలామణి అవుతోంది.
సెల్వమణిని రోజా పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఇదే
నటి రోజా.. తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వాళ్లది ప్రేమ వివాహం. అయితే.. సెల్వమణిని తను పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న కారణం కూడా రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. తెలిసిన వాళ్లను, ప్రేమ వివాహం చేసుకోవాలనే చిన్నప్పటి నుంచి ఉండేది. అయితే.. మా బ్రదర్ మాత్రం చాలా స్ట్రిక్ట్. మా క్యాస్ట్ వాళ్లనే పెళ్లి చేసుకోవాలని అనేవారు. కానీ.. సెల్వమణి నన్నే ప్రపోజ్ చేశారు. అప్పుడు మా బ్రదర్ కు ఓకే అయితే నాకు కూడా ఓకే అన్ని చెప్పా. దీంతో మా బ్రదర్ కూడా ఓకే చేయడంతో మా పెళ్లి జరిగిపోయింది.. అని రోజా చెప్పుకొచ్చారు.
రోజా ఎంత వరకు చదువుకున్నారంటే?
రోజాది చిత్తూరు జిల్లా బాకరావుపేట. అక్కడే రోజా పదో తరగతి వరకు చదువుకున్నారు. ఇంటర్ మీడియెట్ మాత్రం తిరుపతిలో పద్మావతి ఉమెన్స్ కాలేజీలో చదివారు. ఆ తర్వాత డిగ్రీలో చేరారు కానీ.. పూర్త చేయలేదు. డిగ్రీ సెకండియర్ లోనే డిస్ కంటిన్యూ చేశారు రోజా. డిగ్రీ ఫస్టియర్ లోనే తనకు సినిమా అవకాశాలు రావడంతో… ఇక డిగ్రీ చేయడం కుదరలేదట. దీంతో తను సినిమాల మీదనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించి.. చదువును ఆపేశారట.
నాకు సినిమాలు చూడటం పిచ్చి కానీ.. సినిమాల్లోకి రావాలని లేదు
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. కాలేజీకి వెళ్లే సమయంలో.. కాలేజీ ఎగ్గొట్టి మరీ.. సినిమాలకు వెళ్లేవాళ్లం. కానీ.. నేను ఏనాడూ హీరోయిన్ అవ్వాలని కానీ.. సినిమా రంగంలోకి రావాలని కానీ అనుకోలేదు. కానీ.. మొదటి సారి నన్ను శివ ప్రసాద్.. హీరోయిన్ గా అవకాశం ఇస్తామనడంతో నేను నమ్మలేకపోయా. కాలేజీకి ఆడిషన్స్ కు వచ్చి.. నన్ను చూసి ఓకే చేశారు. మా నాన్న కూడా ఒప్పుకోవడంతో నేను వెంటనే ఆ సినిమా చేశాను. ఆ తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.. అని రోజా చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…