హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా ఇంధనంపై ఆందోళన వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న వదంతులు వేగంగా వ్యాపించడంతో వాహనదారులు బంకులవైపు పరుగులు తీశారు. ఫుల్ ట్యాంక్ కోసం ప్రజలు ఒక్కసారిగా రావడంతో నగరవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి.
ప్రత్యేకంగా కూకట్‌పల్లి, అమీర్‌పేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, సనత్‌నగర్, ఎర్రగడ్డ, అబిడ్స్ వంటి ప్రధాన ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా మారింది. చాలా చోట్ల వాహనాలు కిలోమీటర్ల మేర వరుసగా నిలిచిపోయాయి. కొంతమంది గంటల పాటు క్యూలలో వేచి ఉండాల్సి వచ్చింది.
ఈ హడావుడి మధ్య కొన్ని పెట్రోల్ బంకుల వద్ద తాత్కాలికంగా స్టాక్ అయిపోవడంతో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి. దీంతో ప్రజల్లో భయం మరింత పెరిగింది. అయితే అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని స్పష్టం చేశారు.
ఇంధన కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా వదంతులేనని అధికారులు తెలిపారు. నగరానికి అవసరమైనంత పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పుకార్లను నమ్మకుండా, అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో వ్యాప్తి చెందే సమాచారం ఎంత ప్రభావం చూపుతుందో మరోసారి స్పష్టమైంది. చిన్న వదంతి కూడా పెద్ద స్థాయిలో గందరగోళానికి దారితీసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు భారత్‌కు ఆర్థికంగా సవాళ్లను తేల్చి ఇస్తున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం చెందుతూ…
ఇటీవల కాలంలో పేపర్ ప్లేట్ల వినియోగం వేగంగా పెరిగింది. ఇంటి వేడుకల నుంచి పెద్ద ఫంక్షన్ల వరకు భోజనాలకు వీటినే…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాబోయే…
తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ముందుకు…
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే చమురు, వంటగ్యాస్ ధరలపై ప్రభావం చూపిన ఈ…
వేసవికాలం వచ్చిందంటే మన ఆహారంలో పెరుగు తప్పనిసరిగా చోటు దక్కించుకుంటుంది. శరీరాన్ని చల్లబరచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, ప్రోబయోటిక్స్ ద్వారా ఆరోగ్యాన్ని…