Ping Pong Surya : బాహుబలి షూటింగ్ టైంలో… రక్తం పీల్చేసాయి… శ్రీరెడ్డిని తిట్టడానికి కారణం ఇదే : సూర్య

Ping pong Surya : ‘తపన’ సినిమాతో తెలుగులో పరిచయమైన పింగ్ పాంగ్ సూర్య రాజమౌళి ‘సై’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా విజయంతో ఇండస్తీ లో మంచి అవకాశాలను అందుకుని హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లను చేస్తూ కేరర్ నిర్మించుకున్న సూర్య సై సినిమా తరువాత పింగ్ పాంగ్ సూర్య గా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక చిరంజీవి గారి సినిమా ‘జై చిరంజీవ’ లో చిన్న పాత్ర చేసినా మంచి పేరు వచ్చింది. రాజమౌళి, చంద్ర సిద్ధార్థ, కరుణాకరణ్ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన సూర్య తన సినిమా కష్టాలను, అలాగే డైరెక్టర్స్ దగ్గర తాను నేర్చుకున్న విషయాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

బాహుబలి విషయంలో అలా జరిగింది…

బాహుబలి సినిమాలో ప్రభాస్ కి స్నేహితుడిగా నటించి సూర్య రాజమౌళి గారితో సై సినిమా నుండి పరిచయం ఉంది. ఇక బాహుబలి షూటింగ్ కోసం కేరళ అడవులకు 25 రోజులు వెళ్ళినపుడు చిట్టడవుల్లో ఇరవై వెహికల్స్ లో అందరం వెళ్తుంటే అక్కడ వర్షాలకు ఒకసారి చెట్లు పడిపోతే వెహికల్స్ ఆగిపోయి ఏం చేయాలో తెలియక అక్కడ చెట్లను ఏం చేసిన పోలీస్ కేసు అవుతుందని బయపడి ఊరికే ఉంటే రాజమౌళి గారు ఒక లీడర్ లాగా చెట్లను తొలగించడానికి రావడంతో అందరం వెళ్ళాము. ఆ సమయంలో మేకింగ్ వీడియో షూట్ చేసిన వ్యక్తికి బాగా జలగలు ఎక్కి రక్తం పిల్చేశాయి మళ్ళీ షూటింగ్ లొకేషన్ వెళ్ళాక చూస్తే రక్తం కారిపోతోంది ఎన్ని జలగలు ఎక్కయో అపుడు అర్థమైంది.

శ్రీ రెడ్డిని తిట్టింది అందుకే…

ఇక శ్రీ రెడ్డి విషయంలో సూర్య జోక్యం చేసుకుని ఆమెను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అసలు శ్రీ రెడ్డి ని తిట్టాల్సిన అవసరం ఏమిటి అనే విషయం మీద సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఒక మనిషిని కామెంట్ చేస్తే తప్పులేదు కానీ వాళ్ళ ఫ్యామిలీని కూడా కామెంట్ చేయడం తప్పు. పవన్ కళ్యాణ్ గారిని శ్రీరెడ్డి కామెంట్ చేయడం, విమర్శించడం అవన్నీ ఆమె ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ గారిని అనడంతో ఆపకుండా వాళ్ళ అమ్మ గారిని అనడం తప్పు. ఎవరికైనా వాళ్ళను తిట్టినా ఫీల్ అవ్వరేమో కానీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే బాగా బాధేస్తుంది. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పందించాను, ఆమెను తిట్టాను. అంతకు మించి ఆమెతో ఎలాంటి పరిచయం కానీ వివాదం కానీ లేదు అని చెప్పారు.