Political analyst Rajesh Apapsani : బల్ల గుద్ది చెబుతున్న పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడో లేదో కానీ…2024 తరువాత చేసేది మాత్రం ఇదే….: పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని

Political Analyst Rajesh Appasani : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాలన్ని జగన్ మరోసారి సీఎం అవ్వకుండా చూడాలనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తుంటే మరోవైపు టీడీపీ నేత లోకేష్ కూడా యువగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాడు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ సీజన్డ్ పొలిటిషన్ లాగ కనపడగా వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చి జగన్ విధానాలను ఎండగడుతున్న విధానం చూస్తుంటే ఈ సారి ఎన్నికలలో పవన్ ప్రభావం చూపగలడు అనిపిస్తుంది. ఇక ఈ అంశం గురించి పవన్ అసలు సీఎం అయ్యే అవకాశం ఉందా లేదా అనే విషయాలను రాజకీయా విశ్లేషకులు రాజేష్ అప్పసాని మాట్లాడారు.

పవన్ సీఎం అవ్వకపోవచ్చు కానీ….

రాజేష్ అప్పసాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గతంలో లాగ లేరు. ఓటమి తరువాత పార్టీ ఎత్తేస్తారు అన్నవాళ్ళ నోర్లు మూయించి పార్టీ ని తనతో నడిచిన వారికీ భరోసా ఇస్తూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గెలిచి సీఎం కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా అసెంబ్లీ కి వెళ్తాడు. అలాగే మరింత పార్టీని బలోపేతం చేసుకోగలుగుతాడు.

టీడీపీ తో పొత్తు పెట్టుకుంటాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాకున్నా వ్యతిరేక ఓటు చీల్చకుండా జగన్ ను గద్దే దించడమే లక్ష్యంగా పవన్ సాగుతున్నారు. టీడీపీ కూడ ఈసారి జగన్ రాకుండా చూడటమే లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకే ఇద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉంది అంటూ రాజేష్ అభిప్రాయపడ్డారు. అయితే 2024 ఎన్నికల తరువాత మాత్రం పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా ప్రభావితం చేస్తాడు అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.