Senior Actor Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనీజం రెండింటిని పండించిన ఆయన బి.ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
రామోజీ రావు ను అనడానికి నువ్వు ఎవరు…
పాత తరం నటులు వారి జీవిత విశేషాల గురించి మాట్లాడుతూ కాకరల గారు పలు ఆసక్తికర అంశాలను మాట్లాడారు. కొంతమంది నటులు ప్రతిభ ఉన్న సినిమా రంగంలో ఎక్కువ కాలం మనుగడ సాగించలేక పోడానికి వారు చేసిన స్వీయ అపరధాలే కాకుండా అప్పటి ఇండస్ట్రీ లోని రాజకీయాలు కూడ ఉన్నాయని కానీ వాటిని పైకి మనం చెప్పుకోమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు రామోజీ రావు మోనార్క్ లాగా ఏలాడు . ఆయన సామ్రాజ్యం స్థాపించాడు.
ఇపుడు ఆయన పని అయిపోయింది అన్నట్లుగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆనాడు ఆ మాటతప్పే, ఇపుడు ఈ మాట తప్పే అంటాను అంటూ కాకరాల తెలిపారు. ఆయన టైం బాగున్నపుడు వెలుగు వెలిగాడు ఇపుడు ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఒక మహాప్రవాహం వచ్చినపుడు ముందున్న నీరు కొట్టుకుపోవాల్సిందే అలాగే మరో మహా ప్రవాహం వచ్చినపుడు ఈ కెరటం అంతే అది జీవితంలోనూ జరుగుతుంది. వాటిని అంగీకరించి నిశ్శబ్దంగా పక్కకు తప్పుకోవడమే మనం చేయాల్సిన పని అంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…