Ponniyin Selvan : మణిరత్నం డైరెక్షన్ లో తన కలల ప్రాజెక్ట్ సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30 న విడుదల అయింది. ఇక మొదటి బొమ్మ ఆల్రడీ పడిపోవడంతో ఇక సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో కొంతమంది ప్రేక్షకులు సినిమా ఎలా ఉందో చెప్పేసారు. కల్కి రచన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం 155 రోజుల్లో మణిరత్నం పూర్తి చేయడం విశేషం. ఇక సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ్ళ, ప్రకాష్ రాజ్ వంటి వారు నటించారు. ఇక అచ్చంగా ఆరవ కథ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా మీద బాగా అంచనాలు ఉన్నాయి. నాలుగేళ్ళ విరామం తరువాత మణిరత్నం సినిమా అవడం, అందునా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో మంచి అంచనాల నడుమ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నది తెలుసుకుందాం.
తమిళ ప్రేక్షకులు ఓకే.. మరి తెలుగు ప్రేక్షకుల సంగతి…
పొన్నియన్ సెలవన్ కల్కి రచన ఆధారంగా తెరకెక్కింది. సినిమాలో పాత్రల పేర్లు, సంస్కృతి అంతా తమిళ కల్చర్. ఇక ఇది వారికి ఓకే కానీ మరి ఇతర భాషల వారి పరిస్థితి ఏమిటి అంటే పొన్నియన్ సెల్వన్ మాతృక నవల చదివిన వారికి త్వరగా ఎక్కుతుందంటూ కొంతమంది ట్విట్టర్ ద్వారా సలహా ఇస్తున్నారు. 155 రోజుల్లో మణిరత్నం మ్యాజిక్ చేశాడంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. మొదటి భాగం సస్పెన్స్ తో తీసుకెళ్తూ రెండవ భాగం లో డ్రామా కంటిన్యూ చేసి ఎక్కడా లాగ్ అవ్వకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాదంటూ చెబుతున్నారు మరి కొంతమంది.
ఇక ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం పాటలకంటే బిజీఎం అదిరిందంటూ చెబుతున్నారు. నందిని పాత్రలో ఐశ్వర్య, కుందవి పాత్రలో త్రిష, ఇక కార్తీ నటన చాలా బాగుందని అభిప్రాయపడ్డారు. చాలా వరకు కార్తీ నటన ను మెచ్చుకుంటున్నారు. ఇక సినిమా క్లైమాక్స్ ఓడ ఫైట్ ఇంకా బాగా తీసి ఉండొచ్చు అంటూ మరి కొంతమంది అభిప్రాయ పడినా హాలీవుడ్ రేంజ్లో మణిరత్నం విజువల్ ఎఫెక్ట్స్ చూపించాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు సినిమా ఎక్కడానికి టైం పడుతుంది కానీ సినిమా ఓకే అనే అభిప్రాయం వినబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో ఆ బిజినెస్ దాటిందంటే హిట్ అయినట్లే ఇక తమిళ ప్రేక్షకులు మాత్రం విజయం సాధించేసాం అంటూ ట్వీట్స్ పెడుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…