Aishwarya Rajesh: తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్న నటి ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు సీనియర్ నటి శ్రీ లక్ష్మీ మేనకోడలిగా హీరో రాజేష్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రాజేష్ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపే ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా నటి ఐశ్వర్య రాజేష్ చెన్నైలో తాజాగా జరిగిన ఊబర్ ఆటో డ్రైవర్ ఘటనపై స్పందించారు. ఇషిత సింగ్ అనే మహిళ చెన్నైలోని ఏసీజే ఇండియా కాలేజ్‌లో జర్నలిజం కోర్సు చదువుతోంది. ఈ క్రమంలోనే ఇషిత ఈస్ట్ కోస్ట్ మద్రాస్ నుంచి ఐబిస్ ఓఎమ్‌ఆర్ హోటల్‌కు రావటానికి తన స్నేహితురాలితో కలిసి ఊబర్ ఆటో ఎక్కింది.
హోటల్ రాగానే తన స్నేహితురాలు దిగి ఆటో డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా అనంతరం ఇషిత దిగుతున్న సమయంలో ఆటోడ్రైవర్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.తన ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఇషిత తనపై పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయారు.
ఇషిత ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అరగంటలో సంఘటన స్థలానికి చేరుకొని మరుసటి రోజు ఆటో డ్రైవర్ ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై నటి ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇలాంటి వెధవలను అస్సలు వదిలిపెట్టకూడదు కఠినంగా శిక్షించాలి అంటూ ఆటో డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వెంటనే స్పందించి అతనిని అరెస్టు చేసినందుకు పోలీసులకు ఈమె కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…