Seniour actress:తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరు సరసన నటించారు నటి గీత.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం యంగ్ హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
17 సంవత్సరాల వయసులోనే మన ఊరి పాండవులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె సుమారు 250 సినిమాలకు పైగా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా తాజాగా నటి గీత ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొని తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఇండస్ట్రీలో తనకు చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని ఆయనతో కలిసి ఒక సినిమాలో నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా గీత షాకింగ్ కామెంట్ చేశారు అదేవిధంగా చిరంజీవిలో తన కళ్ళు అంటే తనకు చాలా ఇష్టమని ఈ సందర్భంగా మెగాస్టార్ గురించి గీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే తాను పెద్దగా చదువుకోలేదని కేవలం ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని ఈమె తెలిపారు ఏడవ తరగతి చదువుతున్న సమయంలోనే తనకు మన ఊరి పాండవులు సినిమాలో నటించే అవకాశం వచ్చిందని సినిమాలలోకి రావడం వల్ల ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారని ఈ సందర్భంగా గీత తెలియజేశారు. ఇలా ఈమె తన బాల్యం గురించి తన సినీ కెరియర్ గురించి ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలను ముచ్చటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…