సాధారణంగా మనం డబ్బులు డిపాజిట్ చేసుకోవడం కోసం చాలా మంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా డబ్బులను డిపాజిట్ చేస్తుంటారు. అయితే చాలామందికి ఈ పోస్ట్ ఆఫీస్ సేవలు తెలియక ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ పోస్ట్ ఆఫీస్ ఒక ప్రత్యేకమైన యాప్ మన ముందుకు తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ అందించే సేవలన్నింటిని తెలుసుకోవచ్చు.
ముందుగా మన స్మార్ట్ ఫోన్ లో పోస్ట్ ఇన్ ఫో ఉంటుంది . ఈ యాప్ ద్వారా పోస్ట్ ఆఫీస్ సెర్చ్, పోస్టేజ్ క్యాలిక్యులేటర్, ఇన్స్యూరెన్స్ ప్రీమియం క్యాలిక్యులేటర్, ఇంటరెస్ట్ క్యాలిక్యులేటర్ వంటివి అందుబాటులో ఉంటాయి.అదేవిధంగా మన ప్రాంతంలో పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియకపోతే ఈ యాప్ లో మనం మన పిన్ కోడ్ ఎంటర్ చేస్తే చాలు మన చుట్టూ ఉన్న పోస్ట్ ఆఫీస్ వివరాలు మనకు కనిపిస్తాయి.
పోస్ట్‌ఇన్ఫో యాప్ ద్వారా స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్, ఇన్స్యూర్డ్ లెటర్, వ్యాల్యూ పేయబుల్ లెటర్, ఇన్స్యూర్డ్ వ్యాల్యూ పేయబుల్ లెటర్, రిజిస్టర్డ్ ప్యాకెట్స్, రిజిస్టర్డ్ పీరియాడికల్స్, రిజిస్టర్డ్ పార్శిల్ వంటి తదితర సేవలను ట్రాక్ చేయవచ్చు.ఈ సేవల కోసం మన రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేస్తే మన పార్శిల్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
ఈ యాప్ ద్వారా ఏ పార్శిల్‌కు ఎంత ఛార్జీ చెల్లించాలో కూడా తెలుసుకోవచ్చు.అయితే మన పార్శిల్ దూరాన్ని బట్టి ఛార్జీలు ఉంటాయి.సుకన్య సమృద్ధి యోజన, రికరింగ్ డిపాజిట్, టైమ్ డిపాజిట్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విషయాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…