పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు.. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమాలో నటిస్తున్న ప్రభాస్.. దీని తర్వాత మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టిన ప్రభాస్ రెస్ట్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఇటీవల కరోనా సెకండ్ వేవ్ ఎంటర్ అవ్వడంతో ప్రభాస్ కు కాస్త విరామం దొరికింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ముంగించుకుంది.
త్వరలోనే ఈ సినిమా మిగిలిన పనులను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమాతోపాటుగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాం నీల్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సలార్ ఎం ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేసారు.కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో ప్రభాస్ మాస్ గెటప్ లో అదరగొట్టాడు.
ఈ సినిమాతోపాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ఆదిపురుష్ , నాగ్ అశ్విన్ తో ఓ భారీ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నడని తెలుస్తుంది. ‘వార్’ వంటి యాక్షన్ సినిమాలతో ‘ఔరా’! అనిపించిన సిద్ధార్థ్ ఆనంద్ కి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘కత్రినా కైఫ్’ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఎంపిక దాదాపు ఖాయమవుతుందనే అంటున్నారు.
ఇటీవల ప్రభాస్ సినిమాల్లో బాలీవుడ్ భామలు మెరుస్తున్న విషయం తెలిసిందే..ఇటీవలే సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రాద్ధకపూర్ నటించగా, ఆదిపురుష్ లో కృతిసనన్ నటిస్తుంది. అలాగే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కత్రినా కైఫ్ కూడా చేరబోతుందని సమాచారం..మొత్తానికి ప్రభాస్ మాత్రం బాలీవుడ్ హీరోయిన్లకే వరుస అవకాశాలు ఇవ్వడం ఇప్పుడు ఇండ్రస్టీ లో చర్చనీయాంశంగా మారింది..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…