Featured

Prabhas Seenu : శ్రీహరి గారు చనిపోయే ముందు ఎలా ఉండేవారంటే… లోపల పేగులు కొరుక్కుపోయినా నవ్వుతూ షూటింగ్ చేసేవారు : ప్రభాస్ శీను

Prabhas Seenu : ఛత్రపతి, గబ్బర్ సింగ్, రామయ్య వస్తావయ్య వంటి సినిమాల్తో కమెడియన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న శ్రీనివాస్, ప్రభాస్ శీను గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గబ్బర్ సింగ్ లో తన నటనకు మంచి ప్రశంసలే కాకుండా అవకాశాలు కూడా వచ్చాయి. అయితే సరైన ప్లానింగ్ కెరీర్ మీద పెట్టకపోవడం వల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయిన ప్రభాస్ శీను తన కెరీర్ మొదట్లో అనుభవాలను అవమానాలను తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తనతో నటించిన నటుల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్న శీను, శ్రీహరి గారి గురించి ఆయన చివరి రోజుల్లో పడిన ఇబ్బందుల గురించి మాట్లాడారు.

లోపల పేగులు కొరికేస్తున్నా షూటింగ్ చేశారు…

విలక్షణ నటుడు శ్రీహరి. ఆయన అర్థాంతరంగా మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. అటు కమెడియన్ రోల్స్ చేస్తూ సీరియస్ విలన్ గా చేస్తూ అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను తనదైన ముద్ర వేసుకున్న శ్రీహరి గారు చివరగా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా మధ్యలోనే ఆయన మరణించడంతో ఆయన ప్లేసులో లో జగపతి బాబు గారిని తీసుకుని మళ్ళీ రిషూట్ చేసారు. దీంతో శ్రీహరి గారితో ప్రభాస్ శీను కి అనుబంధం ఉంది. పిల్లా నువ్వులేని జీవితం సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం జరగడం అందులో దాదాపు ఏడు నెలలు శ్రీహరి గారి కాంబినేషన్ లో ప్రభాస్ శీను కి సీన్స్ ఉండటం వల్ల ఆయనతో సన్నిహిత్యం పెరిగిందట. ఎప్పుడూ నవ్వుతూ ఉండే శ్రీహరి గారు లోపల పేగులు కొరికేస్తున్నా షూటింగ్ లో మాత్రం నవ్వుతూ తన సీన్స్ చేసేవారు.

భలే నవ్విస్తున్నావ్ శీను ఇంటికి రా అని పిలిచారట. నేను ఏదైనా తేడాగా మాట్లాడితే కొడతారు ఎందుకు వద్ధండి అంటే మాట్లాడితే కొడతా గాని రా కాజా అంటూ నవ్వేవాడని, కొంచెం మనకు ఒంట్లో బాగాలేకపోతే ప్రపంచం ఏదో అయినట్లు భాధపడిపోతాం కానీ ఆయన అంత బాధ తనకు లోపల కలుగుతున్నా కూల్ గా ఉంటారు. మందు తాగకండి అని సలహా ఇస్తే ముందు నువ్వు మానేసెయ్ అని చెప్పారు. అంత ఇబ్బంది ఉన్నా కూడా జిమ్ వర్క్ ఔట్స్ షూటింగ్ విరామంలో కూడా చేసేవారు. అలాంటి ఆయనే మరణించినపుడు మనం ఆరోగ్యం గురించి ఆలోచించాలి లేకపోతే అంతే అని అనిపించింది అంటూ శ్రీహరి గారి గురించి గుర్తుచేసుకున్నారు ప్రభాస్ శీను.

Bhargavi

Recent Posts

రాత్రి నిద్రలో ఈ అలవాటు ఉంటే జాగ్రత్త… దంతక్షయం పెరుగుతుంది!

నిద్రలో నోరు తెరిచి శ్వాస తీసుకోవడం చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…

7 minutes ago

దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే… గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద చెప్పిన అసలు సత్యం!

దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…

15 minutes ago

వేదమంత్రాల నడుమ అద్భుత వేడుక… పాల్ఘర్‌లో మందిర ప్రతిష్ఠ!

మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్‌ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…

45 minutes ago

హాలిడే హార్ట్ సిండ్రోమ్’ అంటే ఏమిటి? వేసవిలో పెరుగుతున్న ముప్పు!

వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై…

53 minutes ago

ఎండ కాదు అసలు విలన్… తేమతో వచ్చే ‘హిడెన్ హీట్’ అలర్ట్!

దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…

1 hour ago

రోజంతా కూర్చుంటారా? ఈ చిన్న మార్పు మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది!

నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్‌కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…

1 hour ago