Movie News

కూతురు పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు ప్రకాష్ రాజ్.. పెళ్లి కి కావలసిన డబ్బు ఇస్తాను కానీ..?

సినీ ప్రేక్షకులకు నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలను విలక్షణ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డులను అందుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రకాష్ రాజ్ అందరికీ సుపరిచితమే. గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో భాగంగా ప్రకాష్ రాజు పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఇక మా ఎన్నికల అనంతరం ప్రకాష్ రాజు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతుర్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మొదటి భార్య లలిత కుమారికి ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు సంతానం.అయితే ఓ ప్రమాదంలో తన కొడుకు ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే మృతిచెందాడు. ఇదిలా ఉండగా తన మొదటి భార్యతో పలు మనస్పర్ధలు రావడం చేత ప్రకాష్ రాజ్ తనకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇలా మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రకాష్ రాజ్ 2010వ సంవత్సరంలో డాన్సర్ పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఒక బాబు.ఇక తన మొదటి భార్య పిల్లల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన పెద్ద కూతురు పూజ చదువును పూర్తి చేసుకుందని ప్రకాష్ రాజ్ తన పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన పెద్ద కూతురు పెళ్లికి కావాల్సినంత డబ్బులు ఇస్తాను కానీ పెళ్లికి మాత్రం వారు పిలిస్తేనే వెళ్తానని ఈ సందర్భంగా ప్రకాష్ పేర్కొన్నారు.ఇదే విషయాన్ని తన పెద్ద కూతురికి కూడా చెప్పడంతో అందుకు తాను కూడా ఒప్పుకున్నట్లు ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

54 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

1 hour ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

1 hour ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

1 hour ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

1 hour ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

2 hours ago