Priyamani:సీనియర్ నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు నటి ప్రియమణి.ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలు అందరితో కలిసి సినిమాలలో నటించినటువంటి ఈమె ప్రస్తుతం పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ కీలకపాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలతో పాటు సినిమాలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు అయితే ఈమె ఏ సినిమాలు వెబ్ సిరీస్లలో నటించిన కూడా బోల్డ్ సన్నివేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అలాగే ముద్దు సన్నివేశాలలో కూడా నటించడం లేదు ఇలా ప్రియమని ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నకు ఈమె సమాధానం చెప్పారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ప్రియమణి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను ఇలాంటి సన్నివేశాలలో నటిస్తానని చెబితే చాలు నాకు ఎన్నో అవకాశాలు వస్తాయి. అలాగే అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారు కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని భావించాను. పెళ్లయిన తర్వాత ఇలాంటి సీన్స్ చేయటం వల్ల తెరపై నేను ఆ సన్నివేశాలను చూడటానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతానని తెలిపారు.
ఇక సినిమాలలో ఇలాంటి సన్నివేశాలలో నటించిన ప్రతిసారి నేను నా భర్తకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది మా ఇద్దరి మధ్య మంచి వాతావరణాన్ని ఏర్పరచదు అందుకే తాను ఇలాంటి సన్నివేశాలలో నటించకూడదని నిర్ణయం తీసుకొని ముద్దు సన్నివేశాలు అలాగే కాస్త అభ్యంతరకరమైన సన్నివేశాలకు తాను దూరంగా ఉన్నానని ఈ సందర్భంగా ప్రియమణి తెలియజేశారు.
సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…
మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…
మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…
పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…
చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…
దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ Regina Cassandra తాజాగా బాలీవుడ్ అనుభవాలపై సంచలన వ్యాఖ్యలు…