Priyanka Chopra: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం బాలీవుడ్ కి దూరంగా ఉంటూ హాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తోంది.
అంతేకాకుండా ఫ్యాషన్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ ఎప్పటికప్పుడు సరికొత్త స్టైలిష్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల ప్రియాంక చోప్రా విమర్శలు ఎదుర్కొంటుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన వ్యాఖ్యల వల్ల నటిజన్ లు మండిపడుతున్నారు. అసలు విషయం ఏమిటంటే..
ఇటీవల ఒక వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకి వచ్చిన ప్రియాంక చోప్రాని ‘ ఆర్ఆర్ ఆర్ సినిమా చూశారా అని ప్రశ్నించగా… సినిమా చూసే సమయం తనకు లేదని, తాను సినిమాలు చూడనని,టీవీ షోలు ఎక్కువగా చూస్తుంటా అంటూ ప్రియాంక సమాధానం ఇచ్చింది. దీంతో భారతదేశానికి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదని ప్రియాంక చెప్పటంతో నెటిజన్లు ఆమె మీద మండిపడుతున్నారు.
సినిమాల వల్ల ఎంత బిజీగా ఉన్నా కూడా మన దేశానికి ఆస్కార్ తెచ్చిపెట్టిన ఆర్ ఆర్ ఆర్ వంటి గొప్ప సినిమా చూడటానికి ఆమె దగ్గర మూడు గంటల సమయం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆస్కార్ అవార్డు కోసం యూఎస్ వెళ్లిన ఆర్ఆర్ఆర్ టీం కి ప్రియాంక చోప్రా స్వయంగా ఆతిథ్యం ఇచ్చింది. అలాంటిది ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడలేదని చెప్పటంతో స్టార్ హీరోయిన్ అయ్యుండి ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా చూడలేదని చెప్పటంతో సోషల్ మీడియాలో ఆమె మీద విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ వల్ల ప్రియాంక విమర్శలపాలవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…