Priyamani:టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకానొక సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆగ్ర హీరోలందరి సరసన నటించిన ప్రియమణి పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.ఈ విధంగా ఈమె వెండితెరకు దూరమైనప్పటికీ బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.
ఇకపోతే ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ వరస సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇకపోతే ప్రియమణి ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే గత కొద్దిరోజులుగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంట పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఇలా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నప్పటికీ ప్రియమణి ఈ విషయంపై ఏమాత్రం స్పందించకపోవడంతో నిజమేనని అందరూ భావించారు. అయితే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు.ఈ క్రమంలోనే తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ నా నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇలా ఈ పోస్ట్ షేర్ చేస్తూనే కింద మిస్ యు ముస్తఫా రాజ్ అంటూ లవ్ సింబల్ షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ దంపతుల మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవని వీరిద్దరూ ఎలాంటి విడాకులు తీసుకోలేదని ఈ పోస్టు ద్వారా అందరికీ క్లారిటీ వచ్చింది.అయితే ప్రియమణి భర్త ప్రస్తుతం అమెరికాలో ఉండగా ఈమె సినిమా షూటింగ్ ల నిమిత్తం ఇండియాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వీరి గురించి అలాంటి వార్తలు షికారులు చేశాయని అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…