Producer Ashwini Dutt : వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ఎన్నో హిట్ సినిమాలను నిర్మించిన నిర్మాత అశ్విని దత్. రాఘవేంద్ర రావు, అశ్విని దత్ కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు తెలుగులో వచ్చాయి. ఇక చాలా మంది యంగ్ హీరోస్ ను కూడా తెలుగు తెరకు పరిచయం చేసిన బ్యానర్ వైజయంతి మూవీస్. కొన్నేళ్లుగా సినిమా నిర్మాణంకి దూరంగా ఉన్న అశ్విని దత్ ప్రస్తుతం కూతుర్ల నిర్మాణంలో వస్తున్న హిట్స్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతి రత్నాలు, సీతా రామం వంటి సినిమాలను నిర్మించింది ఆయన కూతుర్లు స్వప్న దత్, ప్రియాంక దత్. కూతుర్ల సక్సెస్ మరింత ఆనందాన్ని ఇస్తోందంటూ చెబుతున్న అశ్విని దత్ తాజాగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు అంశాలను గురించి మాట్లాడారు.
ఆయన మాత్రమే గొప్ప నాయకుడు…
అశ్విని దత్ గారు వైజయంతి ఆర్ట్స్ బ్యానర్ పేరును ఎన్టీఆర్ గారి సలహా మేరకు పెట్టారు. అలానే ఆయన కృష్ణుడు రూపంలో ఉన్న బొమ్మ ఆ బ్యానర్ పై ఉంటుంది. ఎన్టీఆర్ గారంటే దేవుడు అనే అశ్విని దత్ గారు ఆయనతో కలిసి తిరిగినపుడు అయన గొప్పతనం మరింత తెలిసిందని చెబుతారు. ఆయన నటుడు ఎలా ఉండాలో నెక్స్ట్ తరాలకు నేర్పించారు అంటూ చిరంజీవి గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న తేడా గురించి మాట్లాడుతూ ఇద్దరూ గొప్ప వాళ్ళే, ఎన్టీఆర్ గారు నటుడు ఎలా ఉండాలో చూపించి క్రమశిక్షణ నేర్పించి పోతే చిరంజీవి గారు దాన్ని తన ముందు తరాలకు చూపిస్తున్నారు. ఎవరికి వారు ఇద్దరూ గొప్పవాళ్లే అంటూ తెలిపారు.
ఇక తాను శక్తి సినిమా వల్ల ఏకంగా 32 కోట్లు నష్టపోయాను, ఆ సినిమా తరువాత ఇక సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పారు. ఇక రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా పార్టీ కోసం తనవంతుగా ఈ సారి ఎలక్షన్స్ లో ప్రచారంలో భాగస్వామ్యం అవుతాను. టీడీపీ తరుపున ప్రచారం చేస్తాను అంటూ చెప్పారు. సినిమా ఇండస్ట్రీకి మేలు చేసిన మొదటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఆయన వల్లే హైదరాబాద్ కు ఇండస్ట్రీ రాగలిగింది. ఆపైన ఇండస్ట్రీని బాగా అక్కున చేర్చుకుంది చంద్ర బాబు గారు. ఆయన కష్టపడే తత్త్వం చూసాకనే ఆయనతో కలిసి పనిచేయాలని అనిపించింది అంటూ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…