Nagachaitanya: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో హీరోయిన్లతో పాటే హీరోలు కూడా ఎల్లప్పుడూ గ్లామర్ మెయింటైన్ చేయడానికి కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా కుర్ర హీరోలు ఎప్పటికప్పుడు స్మార్ట్ గా చాలా హ్యాండ్సమ్ గా కనిపించటానికి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పెళ్లి తరువాత వయసు పెరిగే కొద్ది వారి అందంలో మార్పులు వస్తుంటాయి.
అక్కినేని వారసుల విషయంలో మాత్రం వయసు పెరిగే కొద్దీ వారి అందం రెట్టింపు అవుతోంది. 60 సంవత్సరాలు వచ్చినా కూడా నాగార్జున ఇప్పటికీ నవమన్మధుడులా మరిచిపోతున్నాడు..ఇక నాగార్జున వారసులైన నాగచైతన్య, అఖిల్ కూడా రోజు రోజుకి చాలా హ్యాండ్ సమ్ గా తయారవుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య వయస్సు పెరిగేకొద్దీ అందంలో తండ్రిని మించిపోయాడు. సమంతని ప్రేమించి పెళ్లి చేసుకొని, సంతోషంగా ఉన్నప్పుడు కంటే.. ఆమెకు విడాకులు ఇచ్చి, మళ్లీ సింగిల్ గా ఉన్నప్పుడు నాగచైతన్య మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నాగచైతన్య లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలా హ్యాండ్సమ్ గా , హాట్ లుక్ తో ఉన్న నాగచైతన్య ని చూసి ఏమున్నాడ్రా బాబు.. ఈ లుక్ లో ఒక సినిమా పడితే.. ఉంటుంది నా సామీరంగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ పనులలో నాగచైతన్య బిజీగా ఉన్నాడు.
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ త్రిల్లర్ గా రూపొందిన కస్టడీ సినిమాలో నాగచైతన్య ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవల థాంక్యూ సినిమాతో పరాజయం చవిచూసిన నాగచైతన్య ఈ కస్టడీ సినిమాతో హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మే 12వ తేదీ విడుదలయ్యే ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…