Featured

Analyst Damu Balaji : సిబిఐ అదుపులో పిఏ కృష్ణా రెడ్డి మొత్తం చేసాడు… క్లైమాక్స్ కి చేరిన వివేకానంద కేసు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా ఉన్న సెల్ ఫోన్ అలాగే లెటర్ ను మాయం చేసిన పిఏ కృష్ణా రెడ్డి గారిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. అయితే ఆ తరువాత ఆయన ఒక మీడియాతో మాట్లాడుతూ హత్య గురించి అలాగే వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత రెడ్డి అల్లుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ల గురించి కీలక వాఖ్యలు చేసారు. ఆ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.

అతను చెప్పినందుకే అలా చేశాను…

అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడుతూ కృష్ణా రెడ్డి గారు హత్య ఎవరు చేసారు అనే విషయాలను మాట్లాడలేదు. తాను ఎవరి వైపు ఉన్నారని చెప్పలేదు. కానీ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సిబిఐ వారు తనను విచారించినపుడు బాగా కొట్టారని, వేళ్ళు వంగిపోయి ఇంకా నొప్పిగానే ఉన్నాయని, కోలుకోవడానికి ఏడాది పడుతుంది అంటూ చెప్పారు. ఈ విషయాలను కోర్టులో అవినాష్ రెడ్డి తరుపు లాయర్ గనుక ప్రస్థావిస్తే సిబిఐ ఇరుకులో పడుతుంది. ఇక సునీత భర్త రాజశేఖర్ రెడ్డి చెబితేనే తాను ఫోన్ అలాగే లెటర్ దాచిపెట్టినట్లు పోలీసులకు చెప్పారు. ఈ విషయం రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. పోలీసులు వచ్చాక కూడా ఇవ్వకుండా దాచిపెట్టి కూతురు వచ్చాక ఆమెకే ఇచ్చారట కృష్ణా రెడ్డి.

ఇక వివేకానంద ఇంటికి ఉదయం ఐదు గంటలకే వెళ్లిన ఆయన తలుపు తీయలేదని ఆయన భార్య సౌభాగ్యమ్మ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఆపైన చనిపోయారని తెలిసాక మొదట ఫోన్ రాజశేఖర్ రెడ్డి గారికే చేసారు, వివేకానంద తరువాత కృష్ణా రెడ్డి గారికి బాస్ రాజశేఖర్ రెడ్డి గారే అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక కృష్ణా రెడ్డి గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సునీత తన మీద కోప్పడినపుడు కూడా తానే మనకు సహాయం చేసేవాడు అతను మనకు వ్యతిరేకం అయితే కేసు మన మీదకే వస్తుంది అంటూ రాజాశేఖర్ రెడ్డి గారు అన్నారు అంటూ చెప్పడం ఇప్పుడు కీలకంగా ఉంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago