Featured

Producer Chittibabu : కృష్ణ గారు చనిపోయాకే పవిత్రతో పెళ్ళని ఎందుకు అనౌన్స్మెంట్ చేశాడంటే… : నిర్మాత చిట్టిబాబు

Producer chittibabu : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటీ జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళు ప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచ్చకీడ్చింది.

కృష్ణ గారు మరణించాక పెళ్లి చేసుకోడానికి కారణం…

ఇక కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల ఇష్యూ కొంచెం సైలెంట్ అయింది. అయితే మరోసారి మీడియా ముందుకు నరేష్, పవిత్ర లోకేష్ లు వచ్చారు. ఈసారి ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ లిప్ లాక్ తో మరీ గట్టిగా చెప్పేసారు. ప్రస్తుతం వీరి లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుండగా అసలు నరేష్ పవిత్ర లోకేష్ లు ఇపుడే పెళ్లి ప్రకటన చేయడాని గల కారణాలను నిర్మాత చిట్టిబాబు వివరించారు. కృష్ణ గారు మరణించిన కొద్ది రోజులకే ఇలా ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అంతకుముందు ఎందుకు ఈ ప్రస్తావన లేదు అనే విషయాల మీద మాట్లాడుతూ నరేష్ తన తల్లి విజయనిర్మల మరణం తరువాత ఒంటరి అయిపోయాడు.

కన్న తండ్రి ఎపుడో దూరమ్యాయడు. ఇక తండ్రి లాగా భావించిన కృష్ణ గారు ఈ మధ్యనే మరణించడంతో ఆయనకంటూ ఒక తోడు ఉండాలని భావించాడు అందుకే మూడో భార్యకు భరణం చెల్లించడానికి సిద్ధపడి ఆమెతో విడాకులు తీసుకుని పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ వివరించారు చిట్టిబాబు. ఏ వయసు వారికైనా తోడు కావాలని భావించడం తప్పు కాదు, ఏ వయసులో అయినా తోడు అవసరమే అంటూ చిట్టిబాబు అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

“వద్దు సరోజా” డైలాగ్ వెనుక షాకింగ్ నిజం.. డైరెక్టర్ కరుణాకరణ్ రివీల్!

ప్రేక్షకులను అలరించిన ప్రేమ కథా చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను దర్శకుడు కరుణాకరణ్ వెల్లడించారు. ముఖ్యంగా “వద్దు సరోజా…

8 hours ago

వేసవి హీట్‌కు సహజ పరిష్కారం… ఈ పండు మీకు తెలుసా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో శరీరానికి చల్లదనం, తేమను అందించే సహజ ఆహారాల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఇలాంటి…

9 hours ago

ఉసిళ్లు తింటారా నిజంగా? ఆశ్చర్యపరిచే గ్రామీణ సంప్రదాయం!

వేసవి చివరి దశలో లేదా వర్షాకాలం ప్రారంభానికి ముందుగా సాయంత్రం సమయంలో ఒక్కసారిగా గుంపులుగా ఎగిరే చిన్న పురుగులను చాలా…

9 hours ago

ఎక్కువ ఉప్పు తింటే… ఎముకలు బలహీనమవుతాయా?

రోజువారీ ఆహారంలో ఉప్పు వినియోగం అధికంగా ఉంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశముందని ఇప్పటికే వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.…

10 hours ago

సుదర్శన చక్రం అంటే కేవలం ఆయుధమా? దాగిన అర్థం తెలుసా!

హిందూ పురాణాల్లో విష్ణుమూర్తి చేతిలో కనిపించే సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైన ఆయుధంగా గుర్తింపు పొందింది. ఇది కేవలం యుద్ధ…

10 hours ago

జీవితానికి అసలు అర్థం ఇదేనా? కృష్ణుడి తత్త్వం చెబుతున్న సత్యం!

ఈ జగత్తులో ఉన్నదంతా భగవంతునిదే అన్న భావన హిందూ తత్వశాస్త్రంలో కీలకమైనది. ముఖ్యంగా శ్రీకృష్ణ తత్త్వంలో ఈ సిద్ధాంతానికి ప్రత్యేక…

10 hours ago