Producer Chittibabu : ఈ మధ్య కాలంలో ఏదైనా సెలబ్రిటి జంట బాగా ఫేమస్ అయ్యారు అంటే అది నరేష్, పవిత్ర లోకేష్. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ జోరుగా వినిపించింది. అందుకు తగ్గట్టే చెట్టా పట్టాలేసుకుని ఇద్దరూ తెగ తిరిగారు. ఇక వీళ్ళ పెళ్లిళ్ల సంఖ్య చూసి జనాలకు కూడా వీళ్ళ ఇష్యూ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అటు పవిత్ర లోకేష్ కు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక ఇటు నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇపుడు నాలుగో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీంతో నరేష్ మరింత ఫేమస్ అయ్యాడు. ఒక వైపు వీళ్ళుప్రేమ పావురాల్లాగా తిరుగుతుంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి మీడియా ముందుకు వచ్చి నానా రచ్చ చేసింది. ఇంకా నాతో విడాకులు తీసుకోకుండానే వీళ్ళు ఎలా కలిసి ఉంటారు అంటూ వీళ్ళను రచ్చకీడ్చింది.
పెళ్లిచేసుకోబోతున్న నరేష్ పవిత్ర.. మూడో భార్యకి భరణం…
ఇక కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల ఇష్యూ కొంచెం సైలెంట్ అయింది. అయితే మరోసారి మీడియా ముందుకు నరేష్ పవిత్ర లోకేష్ లు వచ్చారు. ఈసారి మేము స్నేహితులం అది ఇది అని కాకుండా ఏకంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ లిప్ లాక్ తో మరీ గట్టిగా చెప్పేసారు. అయితే వీరి పెళ్లి ఏమోగానీ మరి మూడో భార్యకు విడాకులు ఇచ్చాడా, ఆమెకు ఎంత భరణం ఇస్తాడు అంటూ అనేక చర్చలు మొదలయ్యాయి. దీన్ని గురించి నరేష్ కు సన్నిహితంగా ఉండే నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ కోర్ట్ లో రమ్య రఘుపతి, నరేష్ ల విడాకుల విషయం తేలిపోయింది.
ఆమెకు ఇవ్వాల్సిన భరణం ఎంతైనా సరే ఇచ్చి సెటిల్ చేసుకోవాలని నరేష్ భావించాడు, అందుకే కోట్లు చెల్లించడానికి వెనకాడలేదు అంటూ చెప్పారు. ఇక నరేష్ కు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని, తన తల్లి నుండి వచ్చిన ఆస్తులలో వాటా తన మూడో భార్య పిల్లలకు ఉంటుంది కానీ నరేష్ కష్టార్జితం విషయంలో అలా ఉండదు. నరేష్ కి ఇవ్వాలనిపిస్తేనే ఆస్థిలో వాటా రమ్య పిల్లలకు చెందుతుంది అంటూ చిట్టిబాబు క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…