Producer Tammareddy Bhardwaja : నిత్యం ఇండస్ట్రీలోని ఏదైనా సమస్య గురించి లేదా జరుగుతున్న పరిణామాలను గురించి తన ఆలోచనలను అలాగే అభిప్రాయాలని ముక్కుసూటిగా చెప్పే సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇటీవల మహేష్ బాబుగారు గతంలో ఒకసారి ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పినందుకు మహేష్ అభిమానుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ ఇష్యూకి సంబంధించి వివరణ ఇచ్చారు.
మహేష్ ను ఆరోజు లాక్కొని వెళ్లడం నిజమే కదా…
సినిమా ఇండస్ట్రీకి శాపం లాగా ఒక విపత్తులాగా ఒకానొక సందర్భంలో సినిమా సీడీ పైరసీ ఉండేది. సినిమా థియేటర్లో విడుదల అయిన కాసేపటికే సిడి షాప్స్ కి వచ్చి ఇల్లీగల్ గా వాటిని అమ్మడం వల్ల ఇండస్ట్రీ పెద్ధ సినిమా చిన్న సినిమా అని లేకుండా నష్టాలను చూసింది. అలాంటి సమయంలో వరంగల్ లో ఒక సిడి షాప్ మీద హీరో మహేష్ బాబు తన అభిమానులతో వెళ్లి దాడి చేసి అక్కడ ఉన్న పైరసీ సిడీలను ధ్వంసం చేసారు.
ఆ సమయంలో పోలీసులు ఆయనను పోలీస్ స్టేషన్ కు లాక్కొని తీసుకెళ్ళారంటూ ఆ సమయంలో ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా మహేష్ కి సపోర్ట్ చేయలేదని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ విషయం మాట్లాడితే మహేష్ అభిమానులు ఎందుకు హర్ట్ అవుతున్నానరో నాకు తెలియదు జరిగినదంతా నిజమే అయినప్పుడు అంటూ తెలిపారు. ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం నేను మీతో ఉంటా అని చెప్పారు. అయితే ఆయన రాలేదు కానీ చెప్పారు మహేష్ కి సపోర్ట్ చేస్తానని అంతకుమించి ఎవరూ రాలేదు. అందుకే ఆ తరువాత నుండి మహేష్ ఇండస్ట్రీలో జరిగే ఏ ఇష్యూకి ఆయన బయటికి రాకుండా అయిపోయారు, ఆయన సినిమాలు ఆయన చేసుకుంటూ పోతున్నారు అంటూ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంత బాబు భార్య లక్ష్మీ…
విజయ్–రష్మిక పెళ్లి శుభకార్యం… సోషల్ మీడియా ఫైర్ ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయపూర్ ప్యాలెస్‌లో సౌత్ ఇండియా స్టార్…
‘వారణాసి’లో కొత్త స్టార్ ఎంట్రీ వార్తలు… పాన్ ఇండియా హీట్ పెరుగుతోంది సూపర్ స్టార్ Mahesh Babu మరియు దర్శక…
టి20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇంకా కొన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటికే సూపర్-8కు…
సౌత్ ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత బిజీగా, అత్యధిక క్రేజ్‌తో దూసుకెళ్తున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. ఆయన…
మోహన్ బాబు ముందస్తు రక్షణకు హైకోర్టు నిరాకరణ… కేసు కొత్త దశలోకి సినీ నటుడు మరియు విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్…