పునీత్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబ సభ్యులకు అలాగే అభిమానులకు,సినీ పరిశ్రమకు చాలామంది కు బాధను వేసింది. పునీత్ మరణం సౌత్ ఇండియా సినీ పరిశ్రమకే తీరని లోటు అని చెప్పవచ్చు. అయితే పునీత్ మరణ వార్త విని ఏకంగా ఒక అభిమాని మరణించాడు. ఇంకొందరు అయితే గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇక పునీత్ మరణం చాలామందికి బాధని మిగిలిస్తే, కొంతమందికి భారీ నష్టాన్ని కలిగించేలా ఉంది.
ఎందుకంటె ప్రస్తుతం పునీత్ రాజ్కుమార్ చేస్తున్న ప్రాజెక్టుల విలువ దాదాపు 400 కోట్లకు పైమాటే. పునీత్ ఒక సినిమాకు వంద కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. అయినా జేమ్స్, ద్విత్వ అనే రెండు సినిమాలు చేస్తున్నారు. ఈ ఒక్కొక్క సినిమాలకు 50 నుంచి 60 కోట్ల బడ్జెట్ అనుకున్న, రెండు సినిమాలకు కలిపి 100 నుంచి 120 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది.
ఈ సినిమాలు ప్రస్తుతం సగంలోనే ఆగిపోతాయి. ప్రస్తుతం ఈ సినిమా దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. పునీత్ రాజ్ కుమార్ నిర్మాతగా సొంత బ్యానర్ లో సినిమాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలు అతని బ్యానర్ లో ప్లాన్ చేసుకుంటున్నారట. వాటన్నిటికీ 60 కోట్ల బడ్జెట్ తో మార్కెట్ యావరేజ్ గా వేసుకున్నా అవన్నీ కలిపితే 300 కోట్లకు పైగానే మార్కెట్ ప్రభావం చూపిస్తాయి.
అలా మొత్తం కలుపుకుంటే దాదాపు 400 కోట్ల రూపాయల సినిమా బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది. అతను సినిమాలో నమ్ముకున్న దర్శకనిర్మాతలు, ఇతర టెక్నీషియన్స్ పరిస్థితి అయోమయంగా మారింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నటుడిగానే కాకుండా ఎంతో మందికి సేవలు చేసిన మహానుభావుడు అయ్యాడు పునీత్.పునీత్ ని ఆఖరిసారిగా చూసేందుకు సినీ తారలందరూ బెంగళూరుకు చేరుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…