R.K. Roja : సెలబ్రిటీలు అనగానే ఫాలోయింగ్, అభిమానులు వారి ప్రేమ సెలబ్రిటీల కష్టానికి ప్రతిఫలంగా లభిస్తాయి. సినిమా వాళ్లకు ఉన్న క్రేజ్ మరెవరికి ఉండదు. అందుకే ఎంతో మంది ఆ రంగుల ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతారు. ఇకపోతే ఆర్కే రోజా సెల్వమణి.. తెలుగు ప్రజలకు తెలియని వ్యక్తి కాదు. అ హీరోయిన్ గా ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకున్న రోజా ఆ తరువాత బుల్లితెర మీద అలరించింది. ఇక పోతే రాజకీయ ప్రవేశం చేసి సమాజ సేవ చేస్తోంది.
సమాజ సేవకు అభిమాని…
రోజా సినిమాల్లో హీరోయిన్ గా ఎంతమంది అభిమానులను సొంతం చేసుకుందో అలానే రాజకీయాల్లోను ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అది కాక వేరే రాష్ట్రాల లోని వాళ్ళు అభిమానులు అవడం మామూలు విషయం కాదు. సినిమా అయితే చాలా మందికి భాషతో సంబంధం లేకుండా అభిమానులు అవుతారు. అయితే ఒక లోకల్ రాజకీయ నాయకులకు ఇతర రాష్ట్రాల్లో ఫ్యాన్స్ అంటే అది సంతోషించ తగ్గ విషయం.
రోజాకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఇండిగో విమానం లో వైజాగ్ నుండి తిరుపతి కి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇంట శుభాకార్యానికి వెళ్లి వస్తున్న రోజాను ఇండిగో విమానలోని ఎయిర్ హాస్టస్ ప్రియాంక గుర్తుపట్టి మీకు అభిమానిని అంటూ పలకరించింది. ఇక రోజా చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలకు అభిమానినని, లేఖలో రోజా చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను పేర్కొంటూ రాసింది. ఇక తన అభిమాన నేతతో సెల్ఫీ కూడా తీసుకుంది ప్రియాంక. కలకత్తా కు చెందిన ప్రియాంక అభిమానానికి రోజా ఫిదా అయ్యారు. తనతో ప్రియాంక దిగిన సెల్ఫీ ని లెటర్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే…
నేటి జీవనశైలిలో మార్పులు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల…
వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎండలు పెరిగినప్పుడు శరీరంలో వేడి అధికమై అలసట, దాహం, మూత్ర…
సహజీవన సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత…
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…