Mrunal Thakur : శుక్రవారం విడుదలైన సినిమాలో బింబిసార, సీతారామం ఈ రెండు సినిమాలు మళ్ళీ ఇండస్ట్రీకి ఒక వెలుగుని చూపించాయి. ఇందులో సీతారామం ప్రేమ కథగా తెరకెక్కి నలభై కోట్ల బడ్జెట్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో దూసుకుపోతోంది. హనుమాన్ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ గా దూల్కర్, సీత గా మృనాల్ నటించారు. ఇక మృనాల్ సీత పాత్రలో అందరినీ ఆకర్షిస్తోంది. ఇంకేముంది అసలు ఎవరీ మృనాల్ ఠాకూర్ అనే వెతుకులాట మొదలైంది. తెలుగులో మొదటి సినిమా అయినా చక్కటి నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన మృనాల్ ఠాకూర్ జీవితం కూడా అందరికీ ఆదర్శమే..
బుల్లితెర నుండి వెండి తెర మీదికి…
మృనాల్ ఠాకూర్ మహారాష్ట్ర లోని ధులే ప్రాంతంలో పుట్టినా ముంబై లో చదువుకుంది. మాస్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ పూర్తి చేసి నటన మీద ఆసక్తితో టీవీ రంగంలోకి వెళ్ళింది. 2012లో ‘ముజ్ సే కుచ్ కెహెతి.. యే కామోషీయన్’ అనే టీవీ సీరియల్ ద్వారా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత 2014లో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక తన మొదటి సినిమా వట్టిదండు(మరాఠీ)తో సినీ నటిగా అరంగేట్రం చేసింది. అలా 2018లో ‘లవ్ సోనియా’ అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది మృనాల్.
ఇక హృతిక్ తో ‘సూపర్ 30’, జాన్ అబ్రహం తో ‘బాట్లా హౌస్’ సినిమాలో నటించింది. ఇవి రెండు కమర్షియల్ గా మంచి సక్సెస్ ను అందించాయి. ఇక ఇటీవలే షాహిద్ కపూర్ జెర్సీ సినిమలో కూడా నటించింది. అయితే ‘సీతా రామం’ లో నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అలా కమర్షియల్ సక్సెస్ లే కాకుండా మంచి నటనా ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసి కెరీర్ ను చక్కగా ప్లాన్ చేస్తోంది మృనాల్. ఇప్పటికైతే తెలుగు తెరకు మరో నటి దొరికినట్లే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…