Radha Krishna Love story : ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే జంట రాధా కృష్ణులు. రాధా కృష్ణుల ప్రేమ నిస్వార్థమైన ఆరాధన. ఎన్నిసార్లు వారి ప్రేమ కథ విన్నా మళ్ళీ వినాలనిపించే మధురమైన ప్రేమ కథ. అయితే కృష్ణుడు ఎందుకని రాధని పెళ్లి చేసుకోలేదు. వాళ్లిద్దరూ ఎందుకని విడిపోయారు. చివరికి రాధ ఏమైంది, కృష్ణుడు మధుర వెళ్ళిపోయాక రాధ ఎలా బ్రతికింది, ఆమె ఎలా మరణించింది ఈ విషయాలు చాలామందికి తెలియవు. అసలు రాధాకృష్ణులు విడిపోడానికి కారణం తెలుసుకుందాం…
ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించిన రాధను ఎందుకు కృష్ణుడు పెళ్లి చేసుకోలేదు…
శ్రీ కృష్ణుడు తన ఎనిమిదవ ఏట నుండే రాధను ప్రేమించాడు. యశోధా దేవి కృష్ణుడిని అల్లరి చేస్తున్నాడని చెట్టుకు కట్టేసినపుడే తొలిసారి రాధ కృష్ణుడిని చూసింది. ఇక చిన్నత్తనంలోనే మొదలైన వారి ప్రేమ, రాధ కు కృష్ణుడు మీద ఉన్న ఆరాధనా భావం వారి ప్రేమ గాధలతో గోకులం నిండిపోయింది. రాధాకృష్ణులు ఒకే ఆత్మగా మెలిగారు. అయితే కృష్ణుడు గోకులం వదిలి మధుర వెళ్ళాడు ఆ సమయంలో రాధతో జరిగిన గొడవలో రాధ అలిగింది, ఎంత సర్ది చెప్పినా కృష్ణుడి మాట వినలేదు. వీళ్ళిద్దరికి స్నేహితుదైనా సుధామ కూడా నచ్చజెప్పినా రాధ సుధామను తిట్టింది. దీంతో అగ్రహించిన సుధామ నీవు ఎన్నటికీ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేవు అంటూ శపించాడు. కృష్ణుడు రాధ ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా కృష్ణుడి కంటే రాధ వయసులో పెద్దది కావడం వల్ల తల్లి ఒప్పుకోలేదు.
కృష్ణుడు ద్వారక వెళ్ళిపోయి అక్కడ రుక్మిణి, సత్యభామ, జాంబవతి అలా ఎనిమిది మంది భార్యలు 16000 మంది గోపికలతో ఉన్నా రాధ లేని లోటు ఉండేది. రాధ తన విధులను, బాధ్యతలను పూర్తి చేసాక కృష్ణుడి వద్దకు ద్వారక వెళ్ళింది. అక్కడ రాధ ఎవరికీ తెలియక పోవడం వల్ల రాజభవనంలో దేవిక గా ఉంటానంటూ అభ్యర్థించింది. రాధ మునుపటిలా అధ్యాత్మిక బంధంలో కృష్ణుడితో ఉండాలని అనుకున్నా అక్కడ అలాంటి పరిస్థితులు కనిపించక ద్వారక వదిలి వెళ్ళిపోయింది. చివరి సారిగా మళ్ళీ శ్రీ కృష్ణుడుని కలిసినపుడు తన కోసం వేణువు ఊదమని కోరగా కృష్ణుడు మురళీగానం చేస్తున్న సమయంలో అతని వడిలో కన్నుమూసింది. శ్రీ కృష్ణుడు ఆ సంఘటన సమయంలో ఏడుస్తూ తన వేణువును విరిచి అక్కడే పడేసాడు. రాధ మరణించాక జీవితంలో మళ్ళీ ఎటువంటి సంగీత సాధనాన్ని తన వెంట ఉంచుకోలేదు. ఎంతమంది ఉన్నా కృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమ ఇంకెవరిమీద లేదు. అందుకే ఇప్పటికీ రాధాకృష్ణులనే మనం పూజిస్తాం.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…