టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, అతని మాజీ ప్రియురాలు లావణ్యల మధ్య వివాదాం గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజ్‌తరుణ్ తనతో కలిసి 11 ఏళ్లుగా సహజీవనం చేసి ఇప్పుడు మోసం చేశాడని ఇటీవల లావణ్య నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా లావణ్య తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో లావణ్యపై ఫిర్యాదు చేశారు.
బుధవారం సాయంత్రం లావణ్య తమ ఇంటికి వచ్చి దాడికి ప్రయత్నించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరికీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయినా కూడా ఆమె తమను ఇబ్బందులకు గురిచేస్తోందని పోలీస్టేషన్ లో పిర్యాదు చేసారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన మాదాపూర్ సీఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. కాకతీయ హిల్స్ నివాసం ఉంటున్న హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు బసవరాజు, రాజ్యలక్ష్మిల ఇంటికి బుధవారం రాత్రి లావణ్య అనే యువతి వెళ్లి గట్టిగా డోర్ కొట్టి అరిచి గోల చేసిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…