Featured

Raja Ravindra : సెట్స్ లో శ్రీముఖి అలా ఉంటుంది, మా మధ్య అంత రాపో లేదు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినా రాజా రవీంద్ర…!

Raja Ravindra : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించిన రాజా రవీంద్ర చాలా మంది హీరోలకు డేట్స్ కూడా చూస్తారు. వెంకటేష్, రాజ్ తరుణ్, జయసుధ వంటి వారికి సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేస్తుంటారు రాజా రవీంద్ర. తాజాగా క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో నటిస్తున్న రాజా ఆ సినిమాతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు. శ్రీముఖి, రాజా రవీంద్ర, భరణి, మనో కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తి హాస్యభరితంగా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో తనతో పాటు నటించిన శ్రీముఖి గురించి రాజా రవీంద్ర చాలా బబ్లీగా ఉండే అమ్మాయి కానీ సినిమాలో తన పాత్ర చాలా సీరియస్ గా ఉంటుందని, తనను సెట్స్ లో ఆటపట్టించేంత చనువు లేదని మనో తో తాను ఎక్కువ షో లు చేయడం వల్ల తనతో చనువుగా ఉంటుందని నాతో చాలా తక్కువగా మాట్లాడుతుందంటూ వివరించారు.

హీరో అవ్వాలని ఇండస్ట్రీ కి రాలేదని హీరో అయితే చాలా టెన్షన్ పడాలని ఒక సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా హీరో మీద భాద్యత ఎక్కువ ఉంటుందని 5 కోట్లు తీసుకున్నా, 500 కోట్లు తీసుకున్నా ఒక సినిమా విడుదల అప్పుడు హీరో చాలా ఒత్తిడి ఎదుర్కొంటాడంటూ శోభన్ బాబు గారు తనతో అన్న మాటలను చెప్పారు. అందరు హీరోలు తమ వారసులను హీరోలుగా పరిచయం చేస్తున్నారు. మీరేందుకు మీ కొడుకుని సినిమాల్లోకి రానివ్వలేదు అని అడుగగా నేను శోభన్ బాబుగా ప్రతి సినిమాకు ఎంతో టెన్షన్ పడతాను. ఆ టెన్షన్, ఒత్తిడి నా కొడుకు ఎందుకు భరించాలి.

కొన్ని వేల కోట్లు సంపాదించినా ఒక సినిమా విడుదల అప్పుడు ఒక హీరో పడే టెన్షన్ మామూలుగా ఉండదు. అలాంటి టెన్షన్ నా కొడుకుకి ఇవ్వాలనుకోవడం లేదని చెప్పారని గుర్తుచేసుకున్నారు. ఇక హీరోయిన్ల డేట్స్ ఎందుకు చూడడం లేదని అడుగగా ఒక హీరో ఒక సమయంలో ఒక సినిమానే తీస్తాడు. కానీ హీరోయిన్స్ అలా కాదు వివిధ భాషలలో ఏక కాలంలో సినిమాలు తీస్తుంటారు. ఒక్కోసారి అలా డేట్స్ క్లాష్ అవుతుంటాయి. అపుడు వాళ్ళ మేనేజర్స్ పడే టెన్షన్ చాలా సార్లు చూసాను అందుకే హీరోయిన్స్ జోలికి వెళ్లనని చెప్పారు.

Bhargavi

Recent Posts

సినిమా కోసం కఠిన నియమాలు.. కృతి సనన్ ఫిట్‌నెస్ సీక్రెట్ బయటపెట్టింది

సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…

6 minutes ago

పవన్ కల్యాణ్ కోసం కొండగట్టులో పూజలు.. అభిమానుల ఆరాటం వైరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…

12 minutes ago

ట్రంప్‌తో టీ తాగించిన తరుణ్ భాస్కర్.. వీడియో వైరల్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…

20 minutes ago

బాణాసంచా తయారీ కేంద్రంలో విషాదం.. కేంద్రం అలర్ట్

కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…

27 minutes ago

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి షాకింగ్ పని.. టెర్రస్‌పై గంజాయి!

హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…

40 minutes ago

ఆయన నమ్మకమే నా కెరీర్ మలుపు.. అజయ్ ఘోష్ ఎమోషనల్..!

తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…

49 minutes ago