MS Raju : సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఎంఎస్ రాజు ఈమధ్య జోరు తగ్గించారు. ఒకప్పుడు వరుస హిట్లతో ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ గా ఉన్న రాజు ప్రస్తుతం డర్టీ హరి అంటూ వస్తున్నాడు. ఇక ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షో కి ఈ వారం గెస్ట్ గా తన కొడుకు సుమంత్ అశ్విన్ తో పాటు వచ్చిన రాజు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. షో ప్రోమో విడుదల చేసిన ఆలీతో సరదాగా టీం సస్పెన్స్ తో షో మీద ఇంట్రెస్ట్ పెంచేసింది.
ఫైట్ మాస్టర్ పై భూమికా ఫైర్…
ఎంఎస్ రాజు అనగానే ఒక్కడు, దేవి, వర్షం, మస్కా, దేవి పుత్రుడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే, నీ స్నేహం వంటి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గుర్తొస్తాయి. వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న నిర్మాతగా రాజు రికార్డు క్రియేట్ చేసారు. ఇక ఒక్కడు సినిమా షూటింగ్ లో భూమిక ఫైట్ మాస్టర్ పై ఫైర్ అయి బూతులు తిట్టడం వంటి ఆసక్తికర విషయాలను షోలో చెప్పారు.
ఆ విషయం పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగల్సిందే. ఇక లేటెస్ట్ గా డర్టీ హరి అనే సినిమా తీస్తున్న రాజు ఎందుకు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు తీసే వాడు ఇలాంటి సినిమా ఎంచుకున్నాడనే ప్రశ్న రాగా అన్ని జోనర్లో సినిమాలు తీయాలనేది తన కల అని ఎవరు ఎలా ట్రోల్ చేసినా పట్టించుకోనని చెప్పారు. ఇక కొడుకు సుమంత్ అశ్విన్ కూడా షోలో సందడి చేసారు. తన సినిమాల గురించి తన తండ్రి దర్శకత్వం, గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…