Nani : నేచురల్ స్టార్ నాని తన నటనతో సొంతంగా ఎదిగి ఇపుడు టాలీవుడ్ లో వన్ అఫ్ ది ప్రామిసింగ్ హీరోగా ఉన్నాడు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి పైకొచ్చిన వాళ్లలో నాని ఒకడు. ఇక తన సినిమా సెలక్షన్ కూడా చాలా వైవిద్యంగా కొనసాగింది. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూ, కథా ప్రాధాన్యమున్న పాత్రలను చేసాడు. అటు కామెడీ టైమింగ్ తో నవ్విస్తూనే, వి లాంటి థ్రిల్లర్ స్టోరీ తో షాకిస్తాడు. ఇక ఈ మధ్యనే శ్యామ్ సింగ్ రాయ్ అంటూ క్లాసిక్ సినిమా తీశారు.
పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్….
ఇక నాని 2012 లో అంజనను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పేస్ బుక్ ద్వారా పరిచయమైన అంజనతో ఏడడుగులు వేయడం అంత సులువుగా అవ్వలేదని చెప్పారు. తాజాగా నాని నటించిన అంటే సుందరానికి సినిమా విడుదలకు సిద్ధమైంది. నానికి జోడిగా నాజ్రియా ఈసినిమాలో నటించింది. ఇంటర్ క్యాస్ట్ పెళ్లికి సంబంధించిన కథతో ఈ సినిమా రూపొందింది. ఇక ఇంటర్వ్యూలో నాని పెళ్ళికి సంబంధించి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి నాని తనది ఇంటర్ క్యాస్ట్ పెళ్లి కాదని అయితే అంజన కుటుంబం సైన్టిస్టుల నేపథ్యం గల కుటుంబం కావడంతో నాతో పెళ్ళికి సందేహించారు. అదీ కాక అప్పటికి నేనింకా హీరోగా స్ట్రగల్ అవుతున్నాను, కానీ నన్ను చూసి మాట్లాడాక ఒప్పుకున్నారని వెల్లడించారు.
ఇక సినిమాకు సంబంధించి ట్విస్ట్ బాగుంటుందని ప్రేక్షకులకు మంచి సర్‌ప్రైజ్ ఉందని, శ్యామ్ సింగ్ రాయ్ సమయంలో టికెట్ ధరలు బాగా తక్కువగా ఉన్నాయని అందుకే పెంచాలని చెప్పానని అయితే నా మాటలను వేరేగా అర్థం చేసుకున్నారని ఇపుడు కూడా ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇక మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాలో కీలక పాత్రలో నాని, విజయ్, వంశీ పైడి పల్లి సినిమాలోనూ నటిస్తున్నాడాన్న వార్తలు ఒట్టి పుకార్లే అని కొట్టిపడేసారు. అంటే సుందరానికి సినిమా తరువాత దసరా అనే సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…