Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో రాజమౌళి ఒకరు. ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. రాజమౌళి సినిమా అంటే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొనాల్సిందే అంత అద్భుతంగా ఈయన సినిమాలు ఉంటాయి.
సినిమాపై ఉన్న పిచ్చితో ఈయన నటీనటులను ఎంత ఇబ్బంది పెట్టిన ఆయనకు కావలసిన ఔట్ పుట్ తీసుకుంటారని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు వెల్లడించారు. ఒక సన్నివేశాన్ని ఎన్ని రకాలుగా చిత్రీకరించవచ్చో అన్ని రకాలుగా ఈయన చిత్రీకరిస్తారు. ఇక ఇలాంటి ఒక అద్భుతమైన డైరెక్టర్ కి జక్కన్న అనే పేరు కూడా ఉంది. మరి రాజమౌళికి జక్కన్న అనే పేరును ఎవరు పెట్టారు అసలు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయానికి వస్తే…
రాజమౌళికి జక్కన్న అనే పేరును నటుడు రాజీవ్ కనకాల పెట్టారని తెలుస్తుంది. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో రాజీవ్ వెల్లడించారు.ఓసారి అరపేజీ సన్నివేశం చేయాల్సి వచ్చింది. త్వరగా అయిపోతుందిలే అనుకున్నా. కానీ, అర్ధరాత్రి 12:30 సమయం అయింది.వామ్మో! పని రాక్షసుడు.. చెక్కుతున్నాడు సీన్లని జక్కనలా అని సరదాగా అన్నాను కానీ అదే ఆయన పేరుగా మారిపోయింది అని స్వయంగా రాజీవ్ తెలిపారు.
ఇలా రాజమౌళికి జక్కన్న అని పేరు పెట్టినది రాజీవ్ కనకాల అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక వీరిద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు రాజమౌళి ఫస్ట్ దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ సమయం నుంచి వీరిద్దరి మధ్య స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇక రాజమౌళి చేసే సినిమాలలో తప్పనిసరిగా రాజీవ్ కనకాల ఏదో ఒక చిన్న పాత్రలో అయిన మనకు కనిపిస్తూనే ఉంటారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…