టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ప్రపంచ వ్యాప్తంగా నిన్న విడుదలైంది. సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తుండటంతో ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచానాలు నెలకొన్నాయి. కాగా ఈసినిమాను రెండు పార్టులుగా తీసున్న విషయం తెలిసిందే. అయితే బహుబలితో రెండు పార్టులుగా సినిమా తీయడం అనే సంప్రదాయాన్ని రాజమౌళి తీసుకువచ్చారు. ఇప్పుడు సుకుమార్ కూడా రాజమౌళిలాగే పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారు. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే రాజమౌళి చెప్పినందుకే సుకుమార్ పుష్పను రెండు పార్టులుగా తీస్తున్నారట.
అయితే మొదట పుష్ప సినిమాను ఒకే పార్టులో తీయడం సాధ్యం కాదనే అనుకున్నారట సుకుమార్..దీనికి అనుగుణంగానే రెండు పార్టులుగా తీసేందుకు కథను కూడా చిత్ర యూనిట్ సిద్ధం చేసుకుంది. రెండు పార్టులకు సంబంధించి కథతో మార్పులు కూడా చేశారు. కాగా ఎమైదో తెలియదు కానీ మళ్లీ పుష్ఫను ఒకే పార్ట్ గా తీద్దాం అని అనుకున్నారట సుకుమార్ ఈవిషయాన్ని బన్నికి, మైత్రి మూవీ మేకర్స్ కు తెలియజేశారు.
ఈ విషమం అటు తిరిగి.. ఇటు తిరిగి జక్కన్న చెవిలో పడిందట. వెంటనే రాజమౌళి.. సుకుమార్ కు ఫోన్ చేసి.. సినిమాను ఒకే పార్టులో తీద్దాం అనుకుంటున్నారట నిజమేనా..? అని అడిగారు. దీనికి సుకుమార్ అవును రెండు పార్టులు ఎందుకు అని అనిపించిందని అన్నారట.. రాజమౌళి మాత్రం రెండు పార్టులుగా సినిమాను తీయండి. అందుకు కథలో మార్పులు చేయండని సలహా కూడా ఇచ్చారట.
దీంతో సుకుమార్ పుష్ప మూవీని రెండు పార్టులుగా మలిచారు. ప్రస్తుతం మనం మొదటి పార్టును చూశాం. అయితే కథ సాగదీసినట్లు ఉండటం… బలమైన సన్నివేశాలు పడకపోవడంతో.. మూవీని ఒకే పార్టులో తీస్తే బాగుండనే విషయాన్ని ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారట. ఒకే పార్టులో తీస్తే కథనం మరింత బాగుండనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్‌గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…