Meena Daughter: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా గత 40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. బాలనటిగా ప్రేక్షకులను అలరించిన మీనా ఆ తర్వాత హీరోయిన్ గా మారి తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో స్టార్ హీరోల సరసన నటించి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత వివాహం చేసుకొని కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా మళ్లీ భర్త సహకారంతో ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చి తల్లి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉండగా మీనా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల చెన్నైలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ సెలబ్రిటీలు హాజరై మీనాకి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యాడు.
ఇక ఈ కార్యక్రమంలో మీనా కూతురు నైనిక తన తల్లి గురించి మాట్లాడిన మాటలకు రజనీకాంత్ ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి మరణించిన తర్వాత తన తల్లి మానసిక ఒత్తిడికి గురైందని.. అదొక పెయిన్ ఫుల్ టైమ్ అంటూ నైనిక ఎమోషనల్ అయ్యింది. ఈ వీడియోలో నైనిక మాట్లాడుతూ…” అమ్మా.. నటిగా నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను. నటిగా మాత్రమే కాకుండా ఒక తల్లిగా కూడా నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావు.నాన్న మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి.
Meena Daughter: తనకు ఫీలింగ్స్ ఉంటాయి…
ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూ అన్ని విషయాల్లో సాయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొద్దిరోజులుగా మా అమ్మ గురించి కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయని, అమ్మ కేవలం నటి మాత్రమే కాదు.. మీలాగా ఓ మనిషే.. ఆమెకూ ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి వార్తలు రాయొద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. దీంతో అక్కడే ఉన్న రజినీతోపాటు.. ఇతర సెలబ్రెటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…