సీనియర్ నటి సుహాసిని, దర్శకుడు మణిరత్నంను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. సుహాసిని, భారతీయ నటుడు కమల హాసన్ అన్న, నటుడు చారు హాసన్ గారి కూతురు. సుహాసిని తొలిసారి 1980లో నెంజతై కిల్లతే అనే తమిళ చిత్రంలో తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టింది. అయితే ఇక 1985లో కె.బాలచందర్ దర్శకత్వము వహించిన తమిళ సినిమా సింధుభైరవిలో తన నటనకు గాను 1986లో ప్రతిష్ఠాత్మకమైన జాతీయ చలనచిత్ర పురస్కారము (ఉత్తమ నటి) అవార్డును అందుకున్నది.
ఇక మణిరత్నం గారి సంగతి విషయానికి వస్తే… వారి తండ్రి గారు, అన్నదమ్ములు అందరు సినీ ప్రస్థానంలో అనుభవం కలిగిన వారే. దీంతో ఆయనకు సినిమా రంగం వైపు అడుగు పెట్టడానికి ఒక ముఖ్య నేపథ్యం. ఇక ఈయన సినీ ప్రస్థానం మొదలు కన్నడ భాషలో పల్లవి-అనుపల్లవి అను చిత్రం కోసం తీయడానికి ప్రయత్నించగా ఇందులో నటించడానికి సుహాసినిని సినిమా చేయమని అడగడానికి వెళ్ళగా ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీనికి కారణం ఆవిడ మణిరత్నం మీరు ఇంతవరకు ఎన్ని సినిమాల్లో డైరెక్ట్ చేశారు అని అడగగా మణిరత్నం ఇదే నా మొదటి సినిమా అని చెప్పారంట. ఇంకా అప్పుడు ఆవిడ ఆ సినిమాను చేయడం కుదరదని తేల్చి చెప్పడంతో మణిరత్నం నిరాశతో వెనుదిరిగారు.
అయితే ఆ తర్వాత కూడా మరో సినిమాలో నటించమని ఆయన అడగగా అప్పుడు కూడా సుహాసిని నేను చేయను అని చెప్పడంతో మళ్లీ వెనుదిరిగాడు మణిరత్నం. అయితే రెండు సార్లు ఆమె ఒప్పుకోకపోయినా ఆవిడ పట్ల ఉన్న ఆసక్తిని మాత్రం వదులుకోలేదు మణిరత్నం. అయితే ఆ తర్వాత మణిరత్నం చేసిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వగా, ఆ తర్వాత మౌనరాగం అనే సినిమాని తెలుగులో తీసి అది విజయం సాధించింది. ఆ తర్వాత తమిళంలో తమిళ సీనియర్ యాక్టర్ అయినా కమల్ హాసన్ తో నాయకన్ అనే సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. ఇలా తను సినిమాలతో బిజీబిజీగా ఉండగా మరోవైపు సుహాసిని ఒప్పుకున్న చిత్రాలతో తను కూడా బిజీగా ఉంటే ఎవరికి వారి జీవితాల్లో గడిపేస్తున్నారు. అయితే ఇక ఆ తర్వాత మణిరత్నం, రజినీకాంత్ చేస్తున్న దళపతి చిత్రం సమయంలో రజినీకాంత్ మణిరత్నం మాట్లాడుతున్న సందర్భంలో సుహాసిని విషయం అక్కడ ప్రస్థానం వచ్చింది.
అయితే ఇక్కడ రజనీకాంత్ మణిరత్నంకు సుహాసిని పై చూపించే ఆసక్తిని గమనించాడు. దీనితో ఆ తర్వాత మణిరత్నంను సుహాసినితో మాట్లాడి తన విషయాన్ని చెప్పమని చెప్పాడు. అయితే దానికి మణిరత్నం ఆలోచిస్తుండగా రజనీకాంత్ స్వయంగా ఆ విషయంలో చొరవ తీసుకోని ఒక ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసుకొని మీరు అక్కడ కలుసుకోండి అని చెప్పి, ఆ తర్వాత వారిని ఒక డిన్నర్ ప్లాన్ చేయించి వారిని ఏకాంతంగా మాట్లాడామని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అంతే ఆ తర్వాత వారిద్దరు కొన్ని రోజులపాటు ప్రేమను కొనసాగించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక అబ్బాయి కూడా ఉన్నారు. అబ్బాయి పేరు నందన్. ఇక మొత్తానికి రజినీకాంత్ చొరవ చూపడంతో మణిరత్నం సుహాసిని కలిశారని చెప్పవచ్చు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…