హీరోయిన్ “లయ” తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది లయ. 1999 లో “స్వయంవరం” సినిమా తో హీరోయిన్ గా తెలుగు తెరపై పరిచయమైన లయ ఆ చిత్రంలోని తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె టాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. బాలకృష్ణ, జగపతిబాబు, శివాజీ వంటి స్టార్ హీరోలతో నటించారు లయ.
అయితే అదే సమయంలో తను ఎంచుకున్న కధల విషయంలో చేసిన తప్పిదాల వల్ల తెరపై అవకాశాలను కోల్పోతూ వచ్చింది. అయితే అవకశాలు తగ్గుతున్న సమయంలో ఒక ఎన్నారై ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయిన లయ ఆ తరువాత సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూడడం మానేసింది. అయితే ఆమెకు ఒక పాప, బాబు కూడా ఉన్నాడు. ఈ నేపద్యంలో కుటుంబ భాద్యతలు నిర్వర్తిస్తూ అదే సమయంలో తన భర్త బిజినెస్ లో సహాయం చేస్తుందట.
కాగా, గతంలో ఒక దర్శకుడు త్రివిక్రమ్ తన అరవింద సామెత వీరరాఘవ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రకోసం లయను సంప్రదించాడట. లయ మళ్ళి ఎన్టిఆర్ సినిమాతో తెలుగులో రీఎంట్రి ఇస్తుందనే వార్త ఆమధ్య ఫిలింనగర్ లో జోరుగా వినిపించింది. కానీ ప్రస్తుతం తనకు నటనపై ఆసక్తి లేదని సున్నితంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందట
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…