Categories: FeaturedMovie News

ఆ హీరో వల్లే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రికి దూరమైందా… కావాలనే తోక్కేసారా?

సాక్షి శివానంద్… 90వ దశకంలో టాప్ హీరోయిన్ గా కొనసాగిన హీరోయిన్లలో ఈవిడ కూడా ఒకరు. 1977 ఏప్రిల్ 15న ముంబై నగరంలో జన్మించిన ఆవిడ మొట్టమొదటిగా 1996వ సంవత్సరంలో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో అవకాశాలు రావడంతో ఆవిడ చిరంజీవి నటించిన మాస్టర్ సినిమాలో మొదటి సినిమా చేసింది. ఇక అక్కడితో టాలీవుడ్ లో మొదలైన ప్రస్థానం ప్రముఖ కథానాయకుల అందరి సరసన నటించింది అని చెప్పవచ్చు. అందులో అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు అనే సినిమాల్లో నటించి తన నటనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ అమ్మడు ముంబై నుంచి వచ్చినా కూడా ఉన్న తెలుగు హీరోయిన్ లకి ఏ మాత్రం తీసిపోకుండా గట్టిపోటీని ఇచ్చి టాప్ హీరోయిన్ అయ్యింది.

ఇకపోతే అంత బాగా ఉన్నా తన కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఈవిడ జీవితంలో జరిగిన ఒక సంఘటన కారణంగా ఆవిడ అన్ని సర్దుకుని తిరిగి మళ్లీ ముంబైకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. సాక్షి శివానంద్ చెల్లెలు పేరు శిల్ప శివానంద్. సాక్షి శివానంద్ తెలుగులో సినిమాలు చేస్తున్నప్పుడు శిల్పా శివానంద్ టాలీవుడ్ కి చెందిన ఒక ప్రముఖ హీరో కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించింది కూడా. అయితే ఇక ఆ సినిమా సమయంలో శిల్పా శివానంద్ తన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడంతో ఆమె వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ కి హాజరు కాలేకపోయారు.

దీనితో ఆ విషయం తెలుసుకున్న సదరు హీరో తండ్రి తన చెల్లెల్ని ఖచ్చితంగా షూటింగ్ కి హాజరు కావాలని సాక్షిశివానంద్ కు తెగేసి చెప్పాడట. అంతే కాదట సదరు హీరో తండ్రి ఆగ్రహానికి లోనై సాక్షి శివానంద్ చెల్లెలను కొట్టారు. అయితే దీంతో అక్కాచెల్లెళ్ళు ఇద్దరూ కలిసి ప్రముఖ హీరోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ హీరో ఆయన పలుకుబడిని ఉపయోగించి దాని నుంచి తప్పించుకున్నాడు. ఇక దీనితో అవమాన భారం భరించలేని సాక్షి తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకి తిరిగి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్ పరిశ్రమ వైపు ఆమె ఒక్క అడుగు కూడా వేయలేదు. ఈ విషయం జరిగి చాలా రోజులు అవుతున్న ఇంతవరకు ఆ ప్రముఖ హీరో ఎవరో అన్న సంగతి ఎవరికి తెలియక పోవడం నిజంగా విడ్డురం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలేరియా, డెంగ్యూ ఒకేలా అనుకుంటున్నారా..? నిజం ఇది తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…

1 hour ago

శనివారం పిండి దీపం పూజ ఎందుకు ప్రత్యేకం..? పిండి దీపం పూజ రహస్యం ఏమిటి..?

శనివారం రోజు హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేందుకు ఈ రోజు…

1 hour ago

టీ, కాఫీకి గుడ్‌బై చెప్పండి.. ఉదయం మజ్జిగతో అద్భుత లాభాలు!

ఉదయం లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. బెడ్ టీ లేకుండా రోజు మొదలవదనే అలవాటు చాలా…

2 hours ago

స్పృహ కోల్పోతే నీరు తాగిస్తున్నారా..? ఇది ప్రాణాంతక తప్పు కావచ్చు!

అకస్మాత్తుగా ఎవరో స్పృహ కోల్పోతే చాలామంది వెంటనే చేసే పని వారి ముఖంపై నీళ్లు చల్లడం లేదా నీరు తాగించడానికి…

2 hours ago

కాల్షియం లోపానికి ఉప్పు కారణమా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు లేకుండా ఆహారం పూర్తవదు. ప్రతి ఇంట్లో రోజూ వాడే ముఖ్య పదార్థాల్లో ఉప్పు ఒకటి. కానీ దీని వినియోగం…

2 hours ago

టెన్షన్ ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుందా..? జీవనశైలిలో దాగి ఉన్న అసలు కారణాలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…

2 hours ago