Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణించడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఈయనకు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేశారు. ఇక రాకేష్ మాస్టర్ మరణించడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈయనకు భార్య పిల్లలు ఉండగా చివరి రోజులలో మాత్రం అనాధ ఆశ్రమంలో చేరారు.
ఈయన చివరి రోజులన్నీ కూడా అబ్దుల్లాపూర్ మేట్ లోఉన్నటువంటి అనాధ ఆశ్రమంలో చేరారు. అయితే ఈయన ఇక్కడ చేరడానికి గల కారణాలను కూడా ఒక ఇంటర్వ్యూలో మాస్టర్ తెలియజేశారు.తాను మానసికంగా ఎంతో ఆవేదన చెందిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలా అనాధ ఆశ్రమంలో చేరానని తెలిపారు.
తాను ఉంటున్న ఇంటి ఓనర్ తో ఒకరోజు కారు పార్కింగ్ విషయంలో గొడవపడ్డాను తనతో గొడవ పడిన తర్వాత అక్కడ ఉండాల్సిన అవసరం లేదని భావించిన నేను తన భార్య పిల్లల వద్దకు వెళ్లగా తన భార్య తనని ఇంట్లోకి రానివ్వలేదని రాకేష్ మాస్టర్ తెలిపారు..తన వల్ల తన పిల్లలకు హాని జరుగుతుందని ఆమె తనని ఇంట్లోకి రానివ్వకుండా నేను చనిపోయిన నా మొహం కూడా చూడనని చెప్పేసింది.
నేను ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన సమయంలో రామ్ చరణ్ అభిమానులు తన కొడుకుని బాగా కొట్టారు ఆ భయం కారణంతోనే తన భార్య తనని ఇంట్లోకి రానివ్వకుండా చచ్చిన నా మొహం చూడను అంటూ మాట్లాడిందని తన మాటలలోని బాధ నాకు అర్థం కావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక మానసికంగా బాధను అనుభవిస్తూ అనాధ ఆశ్రమంలో చేరాను అంటూ ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…