Priyadarshini Ram: ప్రియదర్శిని రామ్ పలు సినిమాలలో నటుడుగా నటించిన ఈయన కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. అలాగే మీడియా రంగంలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రామ్ వైయస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉంటారు. ఈ మధ్యకాలంలో ఈయన మీడియా రంగానికి సినిమాలకు కూడా కాస్త దూరంగా ఉన్నారని చెప్పాలి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రామ్ నందమూరి బాలకృష్ణ గురించి ఆయన వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తనకు కాలేజీలో జూనియర్ అని తెలియజేశారు. తాను జూనియర్ అయినప్పటికీ నేను మాత్రం అన్న అని పిలుస్తానని రామ్ తెలిపారు. బాలకృష్ణ చాలా తొందరగా కోప్పడతారని అందరూ భావిస్తారు కానీ అతని మనసు చాలా మంచిదని చిన్నపిల్లల వ్యక్తిత్వం అని తెలియజేశారు.
ఒకసారి ఒక పేద పూజారి క్యాన్సర్ బారిన పడే బసవతారకం హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. అయితే ఖర్చులో తనకు కాస్త డిస్కౌంట్ కావాలని తనని అడగడంతో తాను బాలకృష్ణకు ఇదే విషయం గురించి సహాయం కోరారు. ఇలా చికిత్సకు అయినా ఖర్చులో డిస్కౌంట్ కావాలి అంటూ బాలకృష్ణకు మెసేజ్ చేయడంతో వెంటనే బాలకృష్ణ నుంచి తనకు ఫోన్ వచ్చిందని తెలిపారు.
ఇలా ఫోన్ చేసిన బాలకృష్ణ అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? డిస్కౌంట్ అడగడం ఏంటి హాస్పిటలే నీదైతే. నీ హాస్పిటల్లో మరి డిస్కౌంట్ అడగాలా.. అడిగే అవసరమే లేదు డిస్కౌంట్ ఇచ్చేసేయ్ అంటూ చెప్పారు. అంతేకాకుండా తనని ఇంకొకసారి అన్నా అని పిలవద్దని తాను నీకన్నా చాలా చిన్నవాడిని అంటూ బాలకృష్ణ చెప్పారని ఈ సందర్భంగా రామ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…