Ramya Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రమ్యకృష్ణ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస సినిమాలలో నటించి అక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇకపోతే తాజాగా నెల్సన్ దర్శకత్వంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం జైలర్ ఈ సినిమా ఆగస్టు 10వ తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన నువ్వు కావాలయ్యా అనే పాట ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే.
ఇక తమన్నా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఈ పాటకు స్టెప్పులు వేస్తూ అందరిని సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పాటకు నటి రమ్యకృష్ణ డాన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. రమ్యకృష్ణ తన వ్యానిటీ వ్యాన్లో తన ముగ్గురు సిబ్బందితో కలిసి నువ్వు కావాలయ్యా పాటకు డాన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ విధంగా రమ్యకృష్ణ ఈ పాటకు డాన్స్ చేయడంతో ఈ వీడియో చూసినటువంటి పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ ..52 ఏళ్ల వయసులో ఇంత ఎనర్జిటీక్ గా డాన్స్ చేయడం ఏంటి మేడం మీరు కేక అంటూ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో కూడా రమ్యకృష్ణ కీలకపాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె కూడా ఈ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలుస్తుంది.
ఇంట్లో తల్లి మందలించిందనే చిన్న విషయాన్ని మనసుకు పెట్టుకున్న ఓ బాలుడు అర్థరాత్రి ప్రమాదకర ప్రయాణానికి దిగిన ఘటన తెలంగాణలో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్,…
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో 23 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన తనయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలే కాదు,…
ప్రసిద్ధ సినీ నటి హన్సిక మోత్వాని కుటుంబ వివాదం ఇప్పుడు న్యాయస్థానాల వరకు వెళ్లింది. తన వదిన ముస్కాన్ నాన్సీ…
హాలీవుడ్ ప్రముఖ నటుడు మాథ్యూ పెర్రీ మృతి కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న…