General News

Ratha saptami 2025: రేపే రథసప్తమి… ఇలా చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి… అంతా శుభమే?

Ratha saptami 2025: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సూర్య భగవానుడిని ఎంతో పవిత్రమైనటువంటి దేవుడిగా భావించి పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి ఆదివారం సూర్యదేవుడికి ప్రత్యేకమైన దినంగా భావించి సూర్య దేవుడిని పూజిస్తూ ఉంటాము అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు వంటివి కూడా చేస్తూ ఉంటాము. ఇక సూర్య భగవానుడికి అత్యంత పవిత్రమైన రోజును రథ సప్తమిగా జరుపుకుంటాము.

ఇక ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 4వ తేదీ జరుపుకోబోతున్నారు. ఈ క్రమంలోనే రథసప్తమి రోజు ఏం చేయాలి, సూర్య భగవానుడిని ఎలా పూజించాలి? ఏది నైవేద్యంగా సమర్పించాలి అనే విషయానికి వస్తే… సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఇలా ఉత్తరాయణంలో మాఘమాసంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటారు.

ఈరోజు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి పూజిస్తారు ఉదయమే నిద్రలేచి నది స్నానం ఆచరించడం ఎంతో మంచిది. ఇలా నది అందుబాటులో లేనివారు ఇంట్లోనే స్నానం చేసే సమయంలో తలపై జిల్లేడు ఆకు రేగుపండును పెట్టుకుని చేయటం ఎంతో మంచిది. ఇలా స్నానం చేసిన అనంతరం సూర్య భగవానుడి రాగి చెంబులో నీటిని వేసుకుని అర్ఘ్యం ఇవ్వాలి. అనంతరం సూర్య భగవానుడి చిత్రపటాన్ని శుభ్రం చేసి ఎర్రని పుష్పాలతో అలంకరించుకోవాలి. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన పాలు పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి. ఇంటిముందు కూడా ఈరోజు రథం ముగ్గులు వేసుకోవడం మంచిది.

ఇక సూర్యోదయం అయిన తర్వాత తూర్పు దిశగా తులసి కోట పక్కన ఆవుపేడతో శుభ్రంగా అలికి , పొయ్యి వేసి అందులో ఆవు పిడకలతో ఆవు పాలను పొంగించి అందులోనే బియ్యం వేసి స్వామివారికి పాల పొంగలి తయారు చేయాలి అనంతరం ఈ పాలు పొంగలిని ఏడు చిక్కుడు ఆకులలో నైవేద్యంగా దేవుడికి సమర్పించాలి. అయితే ఏడు చిక్కుడుకాయలతో రథం తయారుచేసి తులసి కోట ముందు పెట్టి ఈ చక్కెర పొంగలి నైవేద్యాన్ని కూడా ఆ రథం ముందు ఉంచి పూజ చేయడం వల్ల సూర్య భగవానుడి దీవెనలు మనపై ఉండి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోయి అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

telugudesk

Recent Posts

16 కోట్ల ఇంజెక్షన్‌తో పసిపాపకు కొత్త జీవితం..!

సోషల్ మీడియా శక్తి మరోసారి మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్వికకు దేశవ్యాప్తంగా వచ్చిన సహకారం,…

17 minutes ago

ఆరోగ్యంగా ఉండాలంటే సీజన్ చేంజ్‌లో చేయాల్సింది ఇదే!

వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…

4 hours ago

బీపీ, షుగర్ మాత్రమే కాదు.. 40 తర్వాత ఈ టెస్టులు కూడా అవసరం!

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…

4 hours ago

చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్ రాజ్ ఘాటు కౌంటర్..!

మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…

4 hours ago

అక్షయ తృతీయ స్పెషల్: వాహనం కొనేటప్పుడు ఈ విషయాలు మిస్ అవొద్దు!

అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…

5 hours ago

పిల్లల్లో ఆటిజం సంకేతాలు ఇవేనా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి

పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…

5 hours ago