గత నెలరోజుల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇండస్ట్రీలో తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజ్ ప్యానల్, మంచు విష్ణు ప్యానెల్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఏర్పడింది పరస్పరం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. అసలు మా ఎన్నికలను చూస్తుంటే సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పవచ్చు.
ఇక ఎలక్షన్స్ రోజు వరకు రెండు ప్యానెల్ సభ్యుల మధ్య తారాస్థాయిలో గొడవలు చోటు చేసుకున్నప్పటికీ అక్టోబర్ 10వ తేదీన ఎన్నికలు ముగిసి మంచు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల ఫలితాలపై ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు, హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే శ్రీకాంత్ మాట్లాడుతూ ముందుగా మంచు విష్ణుకు అభినందనలు తెలియజేశాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి శ్రీకాంత్ ఒక్కడే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందారు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి 11 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలుపొందగా మంచు ప్యానల్ నుంచి ఏడుగురు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా విజయం సాధించారు.
కేవలం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ ఒక్కడే గెలుపొందడం విశేషం. శ్రీకాంత్ తన విజయం గురించి మాట్లాడుతూ తాను గెలిచిన దాని కన్నా ప్రకాష్ రాజ్ ఓడిపోయినందుకు ఎంతో బాధగా ఉందని ఈ సందర్భంగా శ్రీకాంత్ తెలియజేశారు.ఎన్నికల కౌంటింగ్ అనంతరం మంచు విష్ణు అధ్యక్ష పీఠం దక్కించుకోవడంతో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మంచు అభిమానులు, పలువురు సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…